సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు కోడె పందాల హడావిడి. కోస్తా జిల్లాలలో ఈ ఏడాది కొన్ని వందల సంఖ్యలో కోడె పందాల బరులు ఏర్పాటు చేసి కొబ్బరితోటల మధ్య జరిగిన ఈ కోడి పందాల జూదంలో కొన్ని వందల కోట్లు చేతులు మారినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ కోడి పందాల కోసం పొరుగు రాష్ట్రాల నుండి కూడ జనం రావడంతో పాటు మహిళలు పిల్లలు కూడ ఈ పందాలను విపరీతంగా ఎంజాయ్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ పందాలు జరుగుతున్న కొన్ని ప్రాంతాలలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు ‘కాబోయే ముఖ్యమంత్రి’ జూనియర్ అంటూ పెట్టిన ఫ్లెక్సీలు మీడియా దృష్టిని ఆకర్షించడంతో ఆ ఫ్లెక్సీల ఫోటోలు ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారాయి.

వాస్తవానికి ప్రస్తుతం తన హవా ను కోల్పోయిన తెలుగుదేశం పార్టీని తిరిగి నిలబెట్టగల సత్తా ఒక్క జూనియర్ కు మాత్రమే ఉంది అంటూ ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత జూనియర్ అభిమానులు ఓపెన్ గా కామెంట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ అభిప్రాయాలకు కొనసాగింపుగా ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈ ఫ్లెక్సీలు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల దృష్టిలో కూడ పడ్డాయి. వాస్తవానికి రాజకీయాలకు చాల దూరం అంటూ జూనియర్ ఇప్పటికే అనేకసార్లు ఓపెన్ గా చెప్పాడు. 

ప్రస్తుతం టాప్ హీరోల లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్న జూనియర్ హవా కనీసం మరో పది పన్నెండు సంవత్సరాలు కొనసాగే ఆస్కారం ఉంది. ఆ తరువాత తారక్ రాజకీయాలలోకి వస్తాడో రాడో తెలియక పోయినా తారక్ అభిమానులు కోరుకుంటున్న కోరిక మాత్రం ఇలాగే మరో పది సంవత్సరాలు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ ఫ్లెక్సీల పై ఎటువంటి స్పందన ఇవ్వకుండా తారక్ తనదైన తీరును కొనసాగిస్తూ తన భవిష్యత్ రాజకీయ ఎంట్రీ పై తన అభిమానులు పెంచుకున్న ఆశలను కొనసాగిస్తున్నాడు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: