ఎస్‌.జె. స‌ర్య ఈయ‌న సినిమాల‌ను తీసే విధానం కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది. టాలీవుడ్‌లో స‌రికొత్త ట్రెండ్ సృష్టించింది ఈ ద‌ర్శ‌కుడే అని చెప్పాలి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు తీసిన చిత్రాల‌న్నీ టాప్ రేంజ్ లో హిట్ అయిన చిత్రాలే. ఇటు ద‌ర్శ‌కుడిగానే కాకుండా... ఆయ‌న‌లో ఉన్న న‌టుడ్ని కూడా బ‌య‌ట‌కి తీసుకువ‌చ్చి ఆయ‌న ఏ పాత్ర‌లో న‌టించినా అందులో లీన‌మైపోయి చేస్తారు. హీరోగా, విల‌న్ ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆయ‌న ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు. అయితే ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం ఆయ‌న మీడియా పై మండిప‌డుతున్నారు... ఎందువ‌ల్లంటే. త‌న‌తో క‌లిసి `మాన్‌స్ట‌ర్‌` చిత్రంలో న‌టించిన ప్రియా భ‌వానీ శంక‌ర్‌కి ఎస్‌.జె. సూర్య కొన్ని రోజుల క్రితం ప్ర‌పోజ్ చేశార‌ట‌. అందుకు ఆమె తిర‌స్క‌రించింద‌ని గ‌త కొన్ని రోజులుగా త‌మిళ మీడియాలో వ‌రుస క‌థనాలు వినిపిస్తు న్నాయి. దీనిపై సూర్య చాలా ఘాటుగా స్పందించారు.

 

ఆయ‌న ఎన్నో చిత్రాల‌కి దర్శ‌క‌త్వం వ‌హించారు. న‌టించారు. రెండు భాష‌ల్లోనూ ఇటు తెలుగు, అటు త‌మిళ్ రెండిటిలోనూ మంచి విజ‌యాల్ని సాధించారు. మెర్స‌ల్‌, స్పైడ‌ర్ వంటి చిత్రాల్లో ఎస్‌.జె. సూర్య విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. స్పైడ‌ర్‌లో శాడిస్ట్‌ పాత్ర‌లో ఓ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి తిరుగులేని విల‌న్‌గా ఆయ‌న‌కు మంచి ప్ర‌శంస‌లే వ‌చ్చాయి.  తాజాగా ఆయ‌న పై సోష‌ల్ మీడియాలో రూమ‌ర్స్ వెల్లువెత్త‌డంతో స్వ‌యంగా ఆయ‌నే రంగంలోకి దిగారు. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు.

 

కొంద‌రు వ్య‌క్తులు పనిగ‌ట్టుకుని త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు.  ప్రియాభ‌వానీ శంక‌ర్‌కు తాను ప్ర‌పోజ్ చేస్తే ఆమె తిర‌స్క‌రించారంటూ గ‌త కొన్ని రోజులుగా మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయ‌ని, ఆధారాలు లేని అస‌త్య వార్త‌ల్ని ప్ర‌చారం చేయొద్దంటూ ఘాటుగా స్పందించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్త‌లు ఎలా ప్ర‌చారం చేస్తారంటూ సీరియ‌స్ అయ్యారు. ప్రియాభ‌వానీ శంక‌ర్, త‌ను `మాన్‌స్ట‌ర్‌` సినిమా నుంచి మంచి స్నేహితులం అని, అంత‌కు మించి త‌మ మ‌ధ్య ఏమీ లేద‌ని, ఈ విష‌యం పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు వార్త‌లు రాయ‌వ‌ద్ద‌ని.   ద‌య‌చేసి విసిగించ‌కండ‌ని  సోష‌ల్  మీడియా వేదిక‌గా ఆయ‌న పై వ‌చ్చిన గాసిప్స్‌కు క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: