‘ఈగ’ మూవీ ఘన విజయంలో రాజమౌళి ప్రతిభతో పాటు ఆ మూవీలో విలన్ గా నటించిన కన్నడ హీరో సుదీప్ ప్రతిభ కూడ చాల కీలకం. ఈ మూవీతో సుదీప్ రాజమౌళి ల మధ్య ఏర్పడిన సాన్నిహిత్యంతో రాజమౌళి సుదీప్ కోసం ‘బాహుబలి’ లో ఒక చిన్న పాత్రను సృష్టించినా ఆ పాత్ర వల్ల సుదీప్ కు పెద్దగా కలిసిరాలేదు.

ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ను దేశంలోని పది భాషలలో డబ్ చేసి ఒకేసారి విడుదల చేయబోతున్నాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు టచ్ చేయని బెంగాలి భాషలో కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ డబ్ చేయబడుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి కన్నడ మార్కెట్ లో విపరీతమైన హైక్ రావడానికి సుదీప్ కు ఈ మూవీలో ఒక కీలక పాత్రను ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారంమేరకు ఈ మూవీలో సుదీప్ అత్యంత కీలకమైన బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ మూవీలోని సుదీప్ పాత్ర చరణ్ జూనియర్ పాత్రలకు సమానంగా చాలా కీలకమైన పాత్ర అని అంటున్నారు. వాస్తవానికి ఈ పాత్ర గురించి ఆలోచనలు మొదట్లో రాజమౌళికి లేకపోయినా ఈమధ్య ఈ సినిమా కధకు సంబంధించి జరిగిన మార్పులలో సుదీప్ పాత్ర క్రియేట్ చేయబడింది అని తెలుస్తోంది. 

కన్నడ సినిమా ప్రేక్షకులలో సుదీప్ కు సూపర్ స్టార్ ఇమేజ్ లో కొనసాగుతున్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి భారీ కలక్షన్స్ కన్నడ రంగం నుండి కూడ రావాలి అంటే ఒక్క చరణ్ జూనియర్ ల ఇమేజ్ సరిపోదని అందువల్ల వ్యూహాత్మకంగా జక్కన్న సుదీప్ ను దింపుతున్నట్లు టాక్. బాలీవుడ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ అలియా భట్ మ్యానియా కన్నడ ప్రేక్షకులలో సుదీప్ మ్యానియా ‘ఆర్ ఆర్ ఆర్’ రికార్డులను తెచ్చి పెడుతుంది అన్న ఆశలతో రాజమౌళి ముందుకు వెళుతున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: