సంక్రాంతి బ‌రిలో మొత్తం నాలుగు చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అందులో ఒక‌టి సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించి మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ `ద‌ర్బార్‌` చిత్రం. కాస్త ప‌ర్వాలేద‌నిపించుకుంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. కొంత మంది దీన్ని క్లాస్ హిట్‌గా చూస్తున్నారు. మూడ‌వ చిత్రం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈచిత్రం హిట్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే ఇదికూడా ఒక‌ర‌కంగా మిక్స‌డ్ టాక్ అనే చెప్పాలి. 


ఈ చిత్రం కూడా కొంత‌మందికి న‌చ్చింది. మ‌రికొంత మంది ప‌ర్వాలేదంటున్నారు. స‌రిలేరు మాస్ హిట్ అయితే ఇది క్లాస్ హిట్ అని భావిస్తున్నారు. ఇక‌పోతే ఆఖ‌రి చిత్రం నాలుగో చిత్రం పండ‌గ‌రోజు విడుద‌లైన చిత్రం నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ స‌తీష్‌వేగ్నేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `ఎంత‌మంచివాడ‌వురా` ఈ చిత్రం మాత్రం ఈ పండ‌గ‌కి అస్స‌లు ఆక‌ట్టుకోలేక‌పోయింది. కళ్యాణ్ రామ్... ఫ్యామిలీ మీద ఎక్కువగా దృష్టి పెట్టి సెంటిమెంట్ సీన్లు, ఎమోషన్లు సీన్లు ఓవర్ గా చూపించాడు సినిమా బోర్ కొట్టేసింది. సీరియ‌ల్‌ను త‌ల‌పించింది. ద‌ర్శ‌కుడు స‌తీష్ పండ‌గ సీజ‌న్ కాబ‌ట్టి ఎక్కువ‌గా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకునే దిశ‌గా వెళ్ళాడు కాని.. తీసేకున్న‌కాన్సెప్ట్ మ‌రీ బోరింగ్ అనిపించింది. `వెల్ ఎమోష‌న్స్ స‌ప్లైయ‌ర్‌` అన్న లాజిక్ అస్స‌లు వ‌ర్క్ అవుట్ కాలేదు. ఎంత సినిమా అయినా స‌రే ఎక్క‌డో ఒక‌చోటైనా లాజిక్ చూస్తారు జ‌నాలు. 


మ‌రీ లాజిక్ మిస్ కావ‌డంతో ఎవ్వ‌రూ ఈ చిత్రాన్ని పెద్ద‌గా ఆద‌రించ‌లేదు. అంతేకాక కామెడీ స‌రిగా లేదు. పాట‌లు ఏదో ప‌ర్వాలేద‌నిపించు కున్నాయి. ఇక హీరో హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలు కూడా పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ‌ట్టు ఏమీ లేవు. దీంతో పాపం క‌ళ్యాణ్‌రామ్ అంత మంచివాడు అనిపించుకోలేక‌పోయాడు. ఇకపోతే క‌ళ్యాణ్ ఎంచుకునే క‌థ‌లు ఎందుకోగాని పెద్ద‌గా హిట్ కావ‌డం లేదు. మంచి హైట్‌.. అందం టాలెంట్ అన్నీ ఉన్నా కూడా క‌ళ్యాణ్‌కి మాత్రం టైం కలిసిరావ‌డం లేదు. ఇక‌పోతే క‌ళ్యాణ్‌రామ్ చిత్రం సంక్రాంతికి విడుద‌ల‌వ్వ‌డం ఇదే మొద‌టిసారి దీన్ని బ‌ట్టి ఆయ‌న‌కు సంక్రాంతి పెద్ద‌గా క‌లిసిరాలేద‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: