సంక్రాంతి బ‌రిలో వ‌చ్చిన నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు మాత్రం మొద‌టి నుంచి అన్ని విష‌యాల్లో పోటీ ప‌డుతూనే వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఒక‌టి స‌రిలేరు, రెండు అల‌వైంకుంఠ‌పురం ఈ రెండు చిత్రాలు ప్ర‌మోష‌న్స్ విష‌యం ద‌గ్గ‌ర నుంచి అన్ని విషయాల్లోనూ పోటీప‌డుతూనే ఉన్నారు. ఇక ఈ రెండు చిత్రాలు విడుద‌లై స‌రిలేరు ప‌ర్వాలేద‌నిపించుకుంటే... అల హిట్ టాక్‌ను సంపాదించుకుంది. మ‌రి ఈచిత్రం విడుద‌లైన రోజు నుంచి కూడా మేము హిట్ అంటే మేము హిట్ అంటూ పోటీప‌డుతున్నారు. అలాగే సోష‌ల్ మీడియాలో వ్యూస్ కూడా ఒక‌ళ్ళ‌ను మించి మరొక‌రు పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ నేప‌ధ్యంలో...

 

ప్ర‌స్తుతం సినిమా  ట్రెండ్ అంతా మారిపోయింది. టీజర్, ట్రైలర్లు ఎంత తక్కువ సమయంలో ఎన్ని వ్యూస్, లైక్స్ సాధించింది, ట్విట్టర్లో ఎంతసేపు ట్రెండ్ అయిందో వంటి చిత్రమైన రికార్డులు మొదలుకుని డే బై డే వసూళ్ల లెక్కలు చూసుకుని పోటీపడుతున్నారు. నాన్ బాహుబలి 2 రికార్డ్స్ అంటూ బెంచ్ మార్క్ పెట్టుకుని సింగిల్ షో కలెక్షన్లలో రికార్డుల్ని వెతుకుతున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలకు సంభందించిన ట్రేడ్ ట్రాకింగ్ వర్గాలు నాన్ బాహుబలి 2 ఫస్ట్ డే, సెకండ్ డే అంటూ రోజువారీ వసూళ్లను కూడా రికార్డుల కిందికి తీసుకురావడమే కాకుండా నాన్ బాహుబలి 2 నూన్ షో, నాన్ బాహుబలి 2 మార్నింగ్ షో కలెక్షన్స్ అంటూ కొత్త రికార్డుల్ని చెబుతున్నారు. దీంతో జనం సైతం ఇవేం రికార్డులు బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

 

అర్ధం ప‌ర్ధం లేని రికార్డుల‌తో కొన్ని ఫేక్ క‌లెక్ష‌న్ల‌ను, అలాగే ఫేక్ రికార్డుల‌ను పెట్టి మాములు జ‌నాల‌ని పిచ్చోళ్ళ‌ని చేస్తున్నార‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌పోతే గ‌తంలో కూడా ఇలా రెండుమూడు చిత్రాలు సండ‌గ సంద‌ర్భంగా విడుద‌ల‌య్యాయి కానీ ఈ సారి పోటీని కాస్త ఎక్కువ‌గా ఫీల‌యిన‌ట్లు అనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: