టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ పై ఇప్పటికే మన తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ బడా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ భారీ హిస్టారికల్ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సముద్ర ఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా గురించి నేడు ఒక జాతీయ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చరణ్, కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. రాజమౌళి గారు ఈ సినిమాను ఎంతో గొప్పగా తీస్తున్నారని, ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటారు కాబట్టే ఆయన సినిమాలు అంత గొప్పగా ఆడుతుంటాయని చరణ్ అన్నారు. ఇక ఈ సినిమాలో తాను పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర విషయానికి వస్తే, ఆ పాత్ర కోసం తాను చాలా హార్డ్ వర్క్ చేసానని, అలానే తన మేకోవర్ లో చేంజెస్ కోసం ఎంతో కష్టపడ్డానని చరణ్ చెప్పుకొచ్చారు. 

 

సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర ఎంతో బాగుంటుందని, తప్పకుండా రిలీజ్ తరువాత మేము అందరి అంచనాలు అందుకుంటాం అనే నమ్మకం ఉందని చరణ్ అన్నారు. తొలిసారిగా తారక్ తో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని, ఇద్దరి పాత్రలు స్క్రీన్ పై అదిరిపోతాయని అన్నారు.  ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించి సినిమాని జులై 30న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: