రవితేజ ఒకప్పుడు వరుస హిట్టు సినిమాలతో దూసుకు పోయాడు. కాని 2018వ సంవత్సరం అంతగా కలిసి రానట్టు ఉంది. ఎందుకంటే వరుస ఫ్లాపులతో హాట్రిక్ కొట్టాడు. అప్పటి నుండి తన సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే తాజాగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు, ఈ మాస్ మహారాజ్.. ఇకపోతే రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహలు జరుగుతున్నాయి..

 

 

ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నటిస్తున్నారు.. ఇదే కాకుండా ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు..  మరోవైపు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమ కూడా రవితేజ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో రవితేజ.. మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న  ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట చిత్ర బృందం...

 

 

ఇకపోతే డిఫరెంట్ సినిమాలతో, యంగ్ జనరేషన్‌ హీరోలు దూసుకుపోతుంటే, సీనియర్‌ హీరోలు మాత్రం ఒక్క సక్సెస్‌ అంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్, జగపతి బాబు లాంటి మీడియం రేంజ్‌ సీనియర్లు హీరో రోల్స్‌కు గుడ్‌బై చెప్పేశారు. కాగా వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి లాంటి వారు, భారీ స్టార్ ఇమేజ్‌తో బండి నెట్టుకొచ్చేస్తుండగా, ప్రస్తుతం లిస్ట్‌లో ఉన్న హీరో రవితేజ తన వంతుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేమంటే హీరోగా బిజీగానే ఉన్నా తాను విలన్‌ రోల్స్‌కు కూడా సై అంటు ప్రకటించాడు.

 

 

అంతేకాదు గతంలో కూడా తాను, కిక్‌, విక్రమార్కుడు లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తున్న సమయంలోనే నా ఆటోగ్రాఫ్‌, శంభో శివ శంభో లాంటి డిఫరెంట్‌ మూవీస్‌ కూడా చేశానన్నాడు. అయితే అప్పట్లో ఆ సినిమాలు ఆడలేదని కానీ ఇప్పుడు ఆడియన్స్‌ మైండ్‌ సెట్ మారిందని, కొత్త కథలను, ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని పేర్కొన్నారు.. ఇక త్వరలోనే రవి అభిమానులు ఈ మాస్ మహరాజును విలన్ పాత్రలో చూసే రోజు వస్తుందన్న మాట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: