కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ గురించి ఆయన సినిమాల గురించి అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లో బాగా చెప్పుకుంటారు. మంచి సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలు బాగా దట్టించి మంచి సక్సస్ లను ఇచ్చాడు. అయితే టాలీవుడ్ లో మెగాస్టార్, సూపర్ స్టార్ లతో తీసిన స్టాలిన్, స్పైడర్ డిజాస్టర్స్ గా మిగిలాయి. అయినా అల్లు అర్జున్ కోసం కథ రెడీ చేసుకొని వేయిట్ చేస్తున్నాడు. ఇక ఈ డైరెక్టర్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తోను రీసెంట్ గా దర్బార్ ని తెరకెక్కించాడు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఒకప్పటి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లా కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో అభిమానులను ఆకట్టుకుంది .

 

నయన్ చేసే లేడీ ఓరియంటెడ్ సినిమాలు స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో కలెక్షన్స్ ని రాబడుతునాయి. అందుకే కోలీవుడ్, టాలీవుడ్ లో రెమ్యూనరేషన్  పరంగా మంచి డిమాండ్ ఉంది. అయితే తాజాగా నయన్ నటించిన దర్బార్ సినిమా ప్రేక్షకులను ఘోరంగా నిరాశ పర్చింది. దర్బార్ సినిమాలో నయనతార పాత్ర మరీ గెస్ట్ రోల్ లాగే ఉందని తన ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా పెదవి విరిచారు. హీరోయిన్ అని పేరు పెట్టారే కాని అందుకు తగ్గట్టుగా క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు దర్శకుడు. 

 

ఇక గతంలో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజినీ సినిమాలో కూడా నయనతార పాత్ర బాగా డిసప్పాయింట్ చేసింది. ఆ సినిమాలో పాత్ర విషయంలో మురగ ముందు చెప్పింది ఒకటి ఫైనల్ కట్స్ లో ఉన్నది ఒకటి అని నయన్ వాపోయింది కూడా. అందుకే మురుగదాస్ పై నయనతార చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో నయనతార మోసపోయింది. దర్బార్ సినిమాలో మీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మురుగదాస్ చెప్పాడట. రజినీకాంత్ కు జోడీగా నటింపజేశాడట. కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం అసలు ఎక్కడా నయన్ పేరే వినిపించలేదు. 

 

దీంతో దర్బార్ సినిమాలో నయన్ పాత్ర మరీ నిరాశపర్చి నీరుగారి పోయింది. దర్బార్ సినిమా లో నయనతార కేవలం స్కిన్ షో కే పరిమితం అయ్యింది. అసలు చాలా సీన్స్ ను షూట్ చేసి తొలగించడం జరిగిందట. దాంతో దర్శకుడు మురుగదాస్ పై నయన్ మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసిందట. మరోసారి మురుగదాస్ ను నయన్ నమ్మకపోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది నిజమా ఇలా ఎందుకు జరిగింది అన్న విషయంలో నయన్ కానీ మురగదాస్ గాని క్లారిటి ఇస్తే బావుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: