సాధారణంగా ఒక సినిమా కథకి బీజం పడేది ఒక వాస్తవిక సంఘటన, లేదా ఒక పాపులర్ పాత్ర, లేదా నవలలు స్పూర్తిగా తీసుకొని ఒక లైన్ అని అనుకుంటారు దర్శక, రచయితలు. దాని చుట్టూ కథ ని అందులోని హీరో,  హీరోయిన్,  విలన్ ... ఇలా వివిధ రకాలా పాత్రలను సృష్టిస్తారు. అయితే ఎక్కువమటికి ఫిక్షన్ బేస్డ్ గానే దర్శక, రచయితలు సినిమా కథలని అల్లుకుంటారు. అలాంటి వాటిలో వాళ్ళకి కావలసినట్టుగానే పాత్రలను క్రియోట్ చేస్తారు. ఆ తర్వాత ఆ పాత్ర స్వభావం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది క్లియర్ గా రాసుకుంటారు.

 

ఇలాంటి సందర్భంలోనే కథలోని కొన్ని కీలక పాత్రలు బాగా ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి ఒక లైవ్ క్యారెక్టర్ తో ముడి పెడతారు. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులో లేదా ఇతర ఫేమస్ పర్సన్స్ ని ఇమిటేట్ చేస్తుంటారు. ఈ తరహాలో మన స్టార్ డైరెక్టర్లు స్ఫూర్తివంతమైన పాత్రలెన్నిటినో సృష్ఠించారు. పూరి- శ్రీనువైట్ల- త్రివిక్రమ్ వంటి సీనియర్లు ఇప్పటికే ఇలాంటివి చాలా చూపించేశారు. ఇప్పుడు వీళ్ల మాదిరిగానే అనీల్ రావిపూడి రియల్ లైఫ్ క్యారెక్టర్ల నుంచి స్ఫూర్తి పొంది పాత్రల్ని రూపొందించడంలో బాగా ఆరితేరాడు.

 

తాజాగా సంక్రాంతి కి రిలీజైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలిసిందట. అనీల్ రావిపూడి రచయితల బృందం నుంచి రీసెంట్‌గా ఓ లీక్ బయటకు వచ్చింది. ఆ పాత్రకు ప్రముఖ రాజకీయ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి స్ఫూర్తి అని తెలుస్తోంది. తేదేపా నాయకుడు .. మాజీ ఎంపీగా దివాకర్ రెడ్డి అందరికీ సుపరిచితం. జేసీ ట్రావెల్స్ ఎంత ఫేమస్ అన్నది అందరికి తెలిసిందే. రాయలసీమకు చెందిన ఈ నాయకుడి స్ఫూర్తితోనే ప్రకాష్ రాజ్ పాత్రను డిజైన్ చేశారని ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలైందట.

 

కడప - కొండారెడ్డి బురుజు వంటి వాటి సృజనకు ఈ పాత్రనే స్ఫూర్తి. కశ్మీర్ నుంచి కడప వరకూ కథను నడిపించడంలో అనీల్ రావిపూడి తెలిగా ట్రాక్ ని నడిపించారు. అయితే అనిల్ రావిపూడిలి యావరేజ్ మార్కులే పడ్డాయి. అయినప్పటికి సంక్రాంతి సీజన్ అన్నిరకాలుగా ఈ సినిమాకి కలిసొచ్చిందన్న టాక్ ఉంది. యాస.. భాష.. మాండలీకం .. ఇలా ప్రతిదీ ప్రకాష్ రాజ్ పాత్రను చూస్తే జేసీనే గుర్తుకు వస్తున్నారట. ఆ ఎగ్రెస్సివ్.. ఇంటెన్స్ ఎమోషన్ కొత్తగా కుదరడానికి కారణం జేసీని ఊహించుకొని ఆ పాత్రను రూపొందించడమేనని అంటున్నారు. ఇక ఎవరి స్పూర్తి అయినా గాని ప్రకాష్ రాజ్ తన పాత్రకు 100 % న్యాయం చేస్తారన్న విషయం తెలిసిందే. వాస్తవంగా అయితే ప్రకాష్ రాజ్ ఎవరినీ ఇమిటేట్ చేయరన్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: