సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు 6వ రోజు కూడా  అదరగొట్టింది. ఏకంగా అన్ని ఏరియాల్లో  నాన్ బాహుబలి రికార్డులను సృష్టించి ఆంధ్రా& తెలంగాణ లో కలిపి 9.50కోట్ల షేర్ ను  రాబట్టింది. తద్వారా  ఈ చిత్రం 6రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 77.94 కోట్ల షేర్ ను రాబట్టింది.  దాంతో  ప్రీ రిలీజ్ బిజినెస్ లో 99శాతం వెనక్కు తెచ్చింది.  ఈరోజు తో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయనుండడంతో బయ్యర్లు  భారీ లాభాలను చూడనున్నారు. 
 
 అటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం 1.85మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.  మరో వైపు ఈచిత్రానికి అల్లు అర్జున్ , అల.. వైకుంఠపురములో నుండి గట్టి పోటీ ఎదురవుతుంది.  ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద  నువ్వా -నేనా అన్నట్లుగా తపడుతున్నాయి. 
 
తెలుగు రాష్ట్రాల్లో 6రోజులకు గాను సరిలేరు నీకెవ్వరు వసూళ్ల వివరాలు : 
 
నైజాం -25.65 కోట్లు 
సీడెడ్ - 11.35 కోట్లు 
ఉత్తరాంద్ర - 11.8 కోట్లు 
గుంటూరు -7.72 కోట్లు 
తూర్పు గోదావరి - 7.23 కోట్లు 
పశ్చిమ గోదావరి - 5.06 కోట్లు '
కృష్ణా - 6.27 కోట్లు 
నెల్లూరు - 2.86 కోట్లు 
 మొత్తం 6రోజులకు గాను షేర్ =77.94 కోట్లు 
 

మరింత సమాచారం తెలుసుకోండి: