సంక్రాంతి కానుకగా  అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ అల వైకుంఠపురములో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రజినీ నటించిన దర్బార్, మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, కళ్యాన్ రామ్ నటించిన ‘ఎంత మంచి వాడవురా’ మూవీస్ రిలీజ్ అయ్యాయి.  అయితే దర్బార్, ఎంత మంచి వాడవురా మూవీస్ పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి.  ఇక మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ పరవాలేదు అనిపించింది. ఇక అల వైకుంఠపురములో రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి రోజు నుంచే  కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు.  

 

ఈ మూవీకి సంగీత నేపథ్యం ఎంతో ప్లస్ అయ్యింది.  సామజవరగమన, రాములో రాముల, పుట్ట బొమ్మ సూపర్ హిట్ సాంగ్స్ మాత్రమే కాదు.. యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించాయి. అయితే క్లెమాక్స్‌లో ఫైట్‌ సీన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ‘సిత్తరాలా సిరపడు’ అంటూ సాగే పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాకపోతే ఈ సాంగ్ త్వరలో ప్రజెంట్ చేస్తామని చెప్పారు చిత్ర యూనిట్.  శుక్రవారం ‘సిత్తరాల సిరపడు’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. శ్రీకాకుళం యాసలో సాగిన ఈ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నట్లు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ తెలిపిన విషయం తెలిసిందే.  

 

ఈ పాటను ఫైట్‌గా తీసి ప్రేక్షకుల చేత ప్రశంసలందుకున్నాడు దర్శకుడు. ఈ పాటను విజయ్ కుమార్ రాయగా, సూరన్న, సాకేత్ కోమండూరి పాడారు. వరకు ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 83 కోట్ల షేర్..రూ. 125 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  తాజాగా  ‘సిత్తరాలా సిరపడు’ యూట్యూబ్ లో మరో సంచలనం సృష్టిస్తుందని చిత్రయూనిట్ బలంగా నమ్ముతున్నారు.  ఇక పాట కూడా ఉర్రూతలూగించేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: