స్టార్ హీరోలు బయట ఎంత క్లోజ్ గా ఉన్నా కూడా సినిమాల పరంగా పోటీ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. ఒకే డేట్ ను ఇద్దరు లాక్ చేసినా లేక ఒకే పండుగకు ఇద్దరు ముగ్గురు హీరోల సినిమాలు వచ్చినా ఆ పోటీ భారీగా ఉంటుంది. నిప్పుకి ఆజ్యం పోసినట్టుగా ఒక హీరో సినిమా పోస్టర్ పై మరో హీరో ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం.. దానికి ప్రతిగా ఇవతల హీరో ఫ్యాన్స్ కూడా అవతల హీరో సినిమా గురించి నెగటివ్ టాక్ పబ్లిసిటీ చేయడం లాంటివి జరుగాయి. అయితే ఇదంతా హీరోలకు తెలుసు కాని ఫ్యాన్స్ కు మాత్రం వద్దని చెప్పరు. తమ అభిమానులకు చెప్పినంత మాత్రానా వారు ఊరుకుంటారా అనే వర్షన్ వారిలో ఉంటుంది.

 

ఇక ఫెస్టివల్ సీజన్ లో వచ్చే సినిమాల ప్రమోషన్స్ చూస్తే.. రిలీజ్ ముందు మా సినిమా బాగుంటుంది అంటే మా సినిమా బాగుంటుందని అంటారు. ఆఫ్టర్ రిలీజ్ సినిమాలకు మంచి టాక్ వస్తే మా సినిమా సూపర్ హిట్ అంటే మా సినిమా సూపర్ హిట్ అనేస్తూ ఎవరికి వారు డప్పు కొట్టుకోవడం కామనే. అసలు ఫలితం ఏంటన్నది ఆడియెన్స్ కు తెలిసినా బలవంతంగా మా సినిమా హిట్టు అనే ప్రమోషన్స్ చేయడం విడ్డూరంగా ఉంటుంది. సినిమా హిట్టు సూపర్ హిట్టు బ్లాక్ బస్టర్ హిట్టు ఇవన్ని ఆడియెన్స్ కు తెలియదు.

 

100 టికెట్ పెట్టి కొన్న సినిమా నచ్చిందా లేదా.. బయట ఉన్న టెన్షన్స్, బిజీ లైఫ్ ఒత్తిడిని సినిమా తీసేసిందా లేదా అన్నదే చూస్తారు. అంతేకాని హీరో తాలూఖా ఇమేజ్.. దర్శకుడి ప్రతిభ ఇవేవి సినిమాను కాపాడలేవు.. ఆడియెన్స్ నుండి బలవంతంగా సినిమాపై మంచి టాక్ తెచ్చేలా చేయవు. ఫెస్టివల్ సీజన్ లో వచ్చిన సినిమాలు మాము మేమే మీకు మీరే అన్నచందాన ప్రమోషన్స్ చేస్తుంటారు. మా బొమ్మే రికార్డులు బద్ధలు కొడుతుందని ఒక సినిమా వాళ్లంటే.. మా బొమ్మ ఆల్రెడీ బద్ధలైన రికార్డులను మళ్లీ క్రియేట్ చేస్తుందని చెబుతుంటారు. ఇదంతా చూసిన ఆడియెన్స్ కు మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: