సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ నటించిన సినిమాలు రిలీజ్ చేసి అద్భుతమైన విజయాలు సాధించాయి. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి పండుగ టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసినట్లు రెండు సినిమాలు అదిరిపోయే విజయాలు సాధించడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఫుల్ హ్యాపీ గా ఉన్నట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరిగినట్లు దానికి కారణం సీఎం వైఎస్ జగన్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఎన్నికల ప్రచారంలో అమ్మ ఒడి అనే హామీ ప్రజలకు ఇవ్వటం జరిగింది.

 

ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో సరిగ్గా జనవరి 9వ తారీఖున సంక్రాంతి పండగ ముందు ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకాన్ని కి అర్హులైన తల్లికి ఆమె బ్యాంక్ అకౌంట్ లో 15 వేల రూపాయలు జమ చేయడం తో ఆ డబ్బును ప్రజలు వాడుకోవడంతో పండగను చాలా ఎంజాయ్ చేసినట్లు దీంతో రెండు సినిమాలు అదే టైంలో 'అలా వైకుంఠపురం లో' మరియు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు విడుదల కావడంతో జగన్ ఇచ్చిన డబ్బుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకున్న ట్లు దీంతో రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమాలకు కూడా కలెక్షన్ అమాంతం పెరగడానికి గల కారణం కూడా వైయస్ జగన్ అన్నట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి.

 

దీంతో సీఎం వైయస్ జగన్ అమ్మ ఒడి పథకం పేరిట వేసిన డబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగను బాగా జరుపుకోవడానికి సహకరించినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: