పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చాడు కానీ.. ఇండస్ట్రీ జనాలు మాత్రం పవర్ ఫుల్ స్టార్ ని వదిలిపెట్టడం లేదు. జనసేనానితో సినిమాలు చేేసేందుకు కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించే క్రిష్, పవన్ ని రాబిన్ హుడ్ లా మార్చాలనుకుంటున్నాడు. 

 

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. పింక్ రీమేక్ తర్వాత వీళ్ల కాంబోలో సినిమా వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీనికి తగ్గట్టే పవన్ కోసం క్రిష్ ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశాడని చెబుతున్నారు. పెద్దోళ్లని కొట్టి, పేదోళ్లకు పంచిన రాబిన్ హుడ్ తరహా కథాంశాన్ని సిద్ధం చేశాడట క్రిష్. క్రిష్ రెడీ చేసిన రాబిన్ హుడ్ స్టోరీ పీరియాడికల్ డ్రామా అని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని.. బ్రిటీష్ పాలకులు దోచుకున్న సొమ్ముని ఎత్తుకెళ్లి పేదలకు పంచే పోరాటకారుడిగా పవన్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. 

 

పేదల పక్షపాతిగా ఉండే కథ కాబట్టి.. ఇది జనసేనాని పొలిటికల్ కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశముంది. అందుకే క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ ఇస్తాడని చాలా నమ్మకంగా ఉన్నాడట. ఇక పవన్ గనుక క్రిష్ కథకు ఒకే చెబితే సమ్మర్ లోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశముంది.

 

ప్రత్యక్ష రాజకీయాల్లో యమా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. తాను సినిమాలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించాడు. ఎప్పుడూ ప్రజాసమస్యలపై పోరాడుతూ..  ప్రజల పక్షాన నిలబడతానని చెప్పాడు. మరి క్రిష్ ప్రతిపాదనను ఒప్పుకుంటాడో లేదో చూడాలి. పైగా ప్రజాసమస్యల పరిష్కారం కథాంశంగా ఉండే సినిమా కాబట్టి ఆయన ఆ సినిమాలో నటించేందుకు మొగ్గు చూపుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: