సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మరోసారి ఆయన పెన్ పవర్ ఏంటో చూపించింది. థమన్ మ్యూజిక్ తో సినిమాకు రిలీజ్ ముందే హిట్ అనిపించేలా జోష్ తెచ్చాడు. ఇక ఈ సినిమా చూసేంత వరకు మరో సాంగ్ ఉందని దాచిపెట్టారు చిత్రయూనిట్. సితారాల సిరిపడు సాంగ్ అది వచ్చినప్పుడు థియేటర్ లో ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరికి కేకలు విజిల్స్ వేయడం మొదలు పెడతారు. సినిమాలో ఈ సాంగ్ ను సీక్రెట్ గా ఉంచారు త్రివిక్రం.

 

అప్పటికే బోర్డ్ రూం ఎపిసోడ్ లో అందరి హీరోల సాంగ్ కు బన్ని స్టెప్పులేయడంతో థియేటర్ దద్దరిల్లిపోయేలా విజిల్స్ వినపడతాయి. అది అయ్యాక సినిమా క్లైమాక్స్ కు వస్తున్న టైంలో సిత్తరాల సిరిపడు సాంగ్ వస్తుంది. ఫైట్ లో సాంగ్.. సాంగ్ లో ఫైట్.. ఎలా చూసినా సరే ఇది ఆడియెన్స్ కు భలే కిక్ ఇచ్చింది. ఇక్కడ ఈ బిట్ సాంగ్ రావడం సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఇక సాంగ్ కు తగినట్టుగానే బన్ని స్టైలిష్ ఫైట్ చేస్తూ డ్యాన్స్ చేయడం అబ్బో మెగా, అల్లు ఫ్యాన్స్ కు పండుగే అనుకోండి.

 

సినిమా చూసొచ్చాక ప్రేక్షకులు ఆ సాంగ్ కోసం అల వైకుంఠపురములో జ్యూక్ బాక్స్ మొత్తం వెతికేశారు. గూగుల్ లో కూడా తెగ సెర్చ్ చేసి ఉంటారు. ఆ పాటకి వచ్చిన రెస్పాన్స్ చూసి సంక్రాంతి విన్నర్ అంటూ ఓ ప్రోమో వదిలారు. ఆ వీడియో కామెంట్స్ లో ఫుల్ సాంగ్ పెట్టమని ఒకటే గోల చేయగా చిత్రయూనిట్ వాళ్ల కోరిక మన్నించి ఈరోజు సిత్తరాల సిరిపడు ఫుల్ సాంగ్ పెట్టింది. కరెక్ట్ టైం కు కరెక్ట్ పాట ఈ సాంగ్ వింటే సినిమా చూడని వారు కూడా సినిమా చూసేలా ఉంటుంది. సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సెన్సేషనల్ హిట్ కాగా పండుగ తెల్లారే ఈ సాంగ్ రిలీజ్ చేసి పండుగ జోష్ కొనసాగించేలా చేస్తున్నారు అల టీం.

https://youtu.be/3QNW3guTYU8

మరింత సమాచారం తెలుసుకోండి: