టాలీవుడ్, కోలీవుడ్ అందాల భామల్లో ఒకరు కాజల్ అగర్వాల్. కెరీర్ ప్రారంభించిన పదేళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లుకు ధీటుగా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో లక్ష్మీ కళ్యాణం మూవీతో పరిచయం అయిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే తన అందాలతో మంత్ర ముగ్దులను చేసింది. ప్రస్తుతం తెలుగు,తమిళ భాషలతో పాటు హిందీలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెక్కిస్తున్న ఇండియన్ 2 మూవీలో కమల్ హాసన్ సరసన నటిస్తుంది. శంకర్ డైరక్షన్ లో భారతీయుడు సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్-2 సినిమాలో తన పాత్ర గురించిన సీక్రెట్స్ బయటకు చెప్పేసింది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.
టాలీవుడ్ లో కాజల్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. హిందీ, తమిళ భాషల్లో ఒక్కో మూవీ చేస్తున్న ఈ బ్యూటీ ఇండియన్–2 పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే కమలహాసన్‌తో తొలిసారిగా జత కట్టడం. స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించడం... పెద్ద బ్యానర్ లో నటించడం.. అన్నీ కలిసి వచ్చే అంశాలే... ఈ మూవీ సక్సెస్ అయితే కొంత కాలంగా హీరోయిన్ గా ఏలేయొచ్చు అనే ఆశలో కాజల్ ఉంది. ఇండియన్–2 మూవీలో తన పాత్ర 85 ఏళ్ల బామ్మదని తెలిసిందన్నారు.
ఈ పాత్రకు తాను న్యాయం చేయగలనా అన్న సందేహం కలిగిందని, అయితే టెక్నికల్ టీమ్ చూస్తుంటే ఈ అనుమానాలు అన్నీ తొలగిపోయాయి అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ పాత్ర కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటిస్తున్నట్లు చెప్పారు. ఈ పాత్రకు మేకప్ కోసమే అనేక గంటలు పడుతోందని తెలిపింది. తన అనుభవాలను చెబుతూ ఇండియన్–2 మూవీ విడుదలైన తరువాత తన ఇమేజ్ వేరే లెవల్‌కు చేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో భారతీయుడు మూవీ జాతీయ స్థాయిలో దుమ్మురేపిన విషయం తెలిసిందే.