టాలీవుడ్, కోలీవుడ్ అందాల భామల్లో ఒకరు కాజల్ అగర్వాల్.  కెరీర్ ప్రారంభించిన పదేళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లుకు ధీటుగా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.  టాలీవుడ్ లో లక్ష్మీ కళ్యాణం మూవీతో పరిచయం అయిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే తన అందాలతో మంత్ర ముగ్దులను చేసింది.  ప్రస్తుతం తెలుగు,తమిళ భాషలతో పాటు హిందీలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెక్కిస్తున్న ఇండియన్ 2 మూవీలో కమల్ హాసన్ సరసన నటిస్తుంది. శంకర్ డైరక్షన్ లో భారతీయుడు  సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్-2 సినిమాలో తన పాత్ర గురించిన సీక్రెట్స్ బయటకు చెప్పేసింది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. 

 

టాలీవుడ్ లో కాజల్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.  హిందీ, తమిళ భాషల్లో ఒక్కో మూవీ చేస్తున్న ఈ బ్యూటీ ఇండియన్‌–2 పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే కమలహాసన్‌తో తొలిసారిగా జత కట్టడం.   స్టార్‌ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించడం... పెద్ద బ్యానర్ లో నటించడం.. అన్నీ కలిసి వచ్చే అంశాలే... ఈ మూవీ సక్సెస్ అయితే కొంత కాలంగా హీరోయిన్ గా ఏలేయొచ్చు అనే ఆశలో కాజల్ ఉంది.  ఇండియన్‌–2 మూవీలో తన పాత్ర 85 ఏళ్ల బామ్మదని తెలిసిందన్నారు.

 

ఈ పాత్రకు తాను న్యాయం చేయగలనా అన్న సందేహం కలిగిందని, అయితే టెక్నికల్ టీమ్ చూస్తుంటే ఈ అనుమానాలు అన్నీ తొలగిపోయాయి అంటుంది ఈ ముద్దుగుమ్మ.  ఈ పాత్ర కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటిస్తున్నట్లు చెప్పారు. ఈ పాత్రకు మేకప్‌ కోసమే అనేక గంటలు పడుతోందని తెలిపింది.  తన అనుభవాలను చెబుతూ ఇండియన్‌–2 మూవీ విడుదలైన తరువాత తన ఇమేజ్‌ వేరే లెవల్‌కు చేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.  అప్పట్లో భారతీయుడు మూవీ జాతీయ స్థాయిలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: