సంక్రాంతికి పెద్ద సినిమాలు సందడి చేయడం చూస్తుంటాం. స్టార్ హీరోలు నువ్వానేనా అన్నట్టుగా తలపడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుద‌ల అయినా పోటీ మాత్రం రెండు చిత్రాల మ‌ధ్యే న‌డుస్తోంది. అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు వ‌ర్సెస్ స్టైలిష్ అల్లు అర్జున్ అయింది. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న విడుదల కాగా.. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ జనవరి 12 విడులైంది. అయితే రెండు చిత్రాలకు హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద సత్తా తేల్చుకునేందుకు కలెక్షన్స్ వేట మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు సంక్రాంతి సీజన్‌లు జరిగిన దానికి భిన్నంగా ఉంది ప్రస్తుత పరిస్థితి.

 

 ఎందుకంటే.. తెలుగు సినిమా చరిత్రలో ఒకేసారి విడుదలైన రెండు బడా సినిమాలు పోటాపోటీగా బాక్సాఫీసు కలెక్షన్లను ప్రకటిస్తుండటం ఇదే మొదటిసారేమో.. దీంతో కలెక్షన్లపై కాకిలెక్కలు చెబుతూ తామే సంక్రాంతి విన్నర్ లు అంటూ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ అని.. ఇన్ని మిలియన్లు వసూలు చేసిందంటూ… ఏకంగా పోస్టర్లు విడుదల చేస్తుండడం అభిమానులు అయోమ‌యంలో ప‌డ్డారు. మహేష్, అల్లు అర్జున్ ఇద్దరూ ఇప్పుడు హీరో రామ్ చరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని టాలీవుడ్ పెద్దలు సూచిస్తున్నారట. 

 

అదేంటి వీరిద్ద‌రి మ‌ధ్య‌లోకి చ‌ర‌ణ్ ఎందుకు వ‌చ్చాడు..? అని అనుకుంటున్నారా.. ఎందుకంటే.. మగధీర బాక్సాఫీస్ హిట్ అయినా కలెక్షన్లను మాత్రం రాంచరణ్ ఎప్పుడూ ప్రకటించలేదు. అలాగే రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టినా..  నిర్మాతగా రాంచరణ్ తీసిన ఖైదీనంబర్ 150, ‘సైరా’ మూవీలు కూడా ఊహించని కలెక్షన్లు సాధించినా రాంచరణ్ ఎన్నడూ కలెక్షన్ల లెక్కలను పోస్టర్లుగా ప్రకటించిందే లేదు. కానీ మహేష్, అల్లు అర్జున్ లు ఇప్పుడు కలెక్షన్లు మావే ఎక్కువ అంటూ రచ్చ చేస్తున్నారు.  అందుకే చ‌ర‌ణ్ చూసి నేర్చుకోవాల‌ని టాలీవుడ్ పెద్ద‌లు సూచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: