ఒకప్పుడు అగ్ర కథానాయికగా నటించిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. కాగా ఈ అమ్మడు సినిమాలు కూడా ఒకటో రెండో అప్పుడప్పుడు దర్శనమిస్తున్నాయి..  మిగితా హీరోయిన్లతో పోలిస్తే ఈ హిరోయిన్ పరిస్థితి మరీ దారుణమని చెప్పాలి.. చేతిలో సినిమాలు లేక అనుకున్న అవకాశాలు లేక ఏ పాత్రలో అయిన చేస్తానని అంటుంది..

 

వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. దాదాపు యంగ్ హీరోలందరితో జతకట్టింది. అయితే ఇప్పుడు తెలుగులో అమ్మడికి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. కొత్త అందాలు టాలీవుడ్ లో అడుగుపెట్టడంతో కాజల్ జోరు కాస్త తగ్గింది. కానీ తమిళ్ లో మాత్రం కమల్ హాసన్ సరసన సినిమా చేస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో కమల్ హాసన్ నటిస్తున్న సినిమా 'ఇండియన్ 2'. ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. 

 

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో కాజల్ పాత్ర పై ఇప్పటికే పలు పుకార్లు షికారు చేశాయి. ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు కాజల్ రోల్ గురించ్చి రాసుకొచ్చారు. తాజాగా వీటన్నిటికీ చెక్ పెట్టింది ఈ బ్యూటీ. అందరు అనుకుంటున్నటుగానే ఈ సినిమాలో వృద్ధురాలి క్యారక్టర్ చేస్తున్నాని చెప్పింది కాజల్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఈ షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ పాత్ర కమల్ హాసన్ తో పోటీపడేలా ఉంటుందని. కమల్ తర్వాత ఆ స్థాయి పాత్ర ఇది అని చెప్పుకొచ్చింది. 

 

అయితే..శంకర్ ఈ సినిమా కోసం తనని అడిగినప్పుడు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారో అని భయపడ్డానని. కానీ షూటింగ్ సమయంలోఆ భయమంతా పోయిందని అంటుంది కాజల్. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా కీలకమైందని దానికోసం చాలా కష్టపడ్డానని, ఈ పాత్ర తన కెరియర్లో నిలిచిపోతుందని అంటుంది కాజల్ . ఇక ఇండియన్2 సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనీ చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమా అన్న కాజల్  కు హిట్ ని అందిస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: