టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అక్కినేని కోడలు సమంత.. ఈమె పెళ్ళైయ్యాకే వరుస సినిమాలలో నటిస్తూ మంచి విజయాన్ని అందుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.. రంగస్థలం నుండి నిన్న వచ్చిన ఓ బేబీ సినిమా వరకు అన్నీ హిట్ సినిమాలే అని వేరేలా చెప్పనక్కర్లేదు.. ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెబ్ సీరియస్ లో కూడా కాలు మోపింది..

 

 

ఇకపోతే స్టార్ హీరోయిన్లో ముందు వరుసలో ఉంటుంది అక్కినేని వారి కోడలు సమంత. అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత  ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది ఈ వయ్యారి. భర్త చైతన్యతో కలిసి పెళ్లి తర్వాత నటించిన మజిలీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతరువాత ఓ బేబీ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. త్వరలో పరుశురాం దర్శకత్వంలో చైతన్య నటిస్తున్న సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా ఎంపిక చేశారు. 

 

ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సమంత తాజాగా ఒక సీనియర్ హీరోతో జత కట్టింది.   కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయనతో మొదటి సారి  సమంత జత కట్టింది. అయితే వీరిద్దరు జత కట్టింది ఒక సినిమాకో లేదంటే ఏదైనా వెబ్ సిరీస్ కో కాదు. వీరిద్దరు కూడా జత కట్టింది ఒక కమర్షియల్ యాడ్ కోసం.మాధవన్ సమంత కలిసి ఒక కాఫీ పౌడర్ యాడ్ లో నటించారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. 

 

సమంత ఎవరి సరసన నటించిన ఆ సినిమాకే ఒక కొత్త జోష్ వస్తుందన్న సంగతి తెలిసిందే.. కాగా మాధవన్ సీనియర్ హీరో అయినా సమంత ఆయన పక్కన చాలా బాగుందని..  వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్ గా సెట్ అయ్యిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మాధవన్ 'సవ్యసాచి' సినిమాతో తెలుగులోకి  రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఇక అనుష్కతో కలిసి నటించిన 'నిశ్శబ్దం' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: