సినిమా అనేది ఎంతో శ్రమతో కూడుకున్న పని అని ఎందరికి తెలుసు. ఒక సినిమా పూర్తవ్వాలంటే దాని కోసం ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్ పడే వేదన, తపన ఊహకందని విధంగా ఉంటుంది. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి కొన్ని నెలలు కష్టపడి ఎంతో సహనంతో, ఎదురయ్యే అడ్దంకులను, అధికమించి దాన్ని పూర్తి చేసి విడుదల చేస్తే, అది చూసిన సగటు ప్రేక్షకుడు మూడు గంటల్లో దాని రిజల్ట్ చెప్పేస్తాడు. అతనికి ఆ సినిమా వెనక కష్టం అవసరం లేదు. ఆ చిత్రానికి పెట్టిన ఖర్చు అక్కర్లేదు. అది అతన్ని ఆనంద పరచిందా లేదా అనేది మాత్రమే చూస్తాడు.

 

 

ఇక ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. అందులో సక్సెస్ అయ్యేటివి అయ్యాయి. కానివి ఫ్లాపులుగా మిగిలాయి.. ఇకపోతే స్టీఫెన్ గఘాన్ దర్శకత్వంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘డూ లిటిల్’. ఇక జంతువుల నేపథ్యంలో సాగే ఈ సినిమాని చూస్తే ఆ జంతువులే సిగ్గుతో తలదించుకుంటాయని సినిమా చూసిన ప్రేక్షకులు ట్రోల్ చేస్తున్నారట.

 

 

అంతే కాకుండా ఈ సినిమాకు పలు ఆంగ్లీ మీడియా వర్గాలు ఇచ్చిన రేటింగ్ చూస్తే షాకవుతారు. ఎంతిచ్చారో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకు ఎంతిచ్చారంటే వన్, వన్ అండ్ హాఫ్, స్టార్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఇకపోతే రాబర్ట్, వసూళ్ల పరంగా ప్రపంచాన్నే శాసించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమాలో ఐరన్ మ్యాన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

 

 

కానీ ‘డూ లిటిల్’ సినిమా మాత్రం ఆయన పరువు తీసేసింది అనుకుంటున్నారట.. అంతేకాదు రాబర్ట్ లాంటి హీరోను పెట్టి ఇలాంటి సినిమాను తీసినందుకు డైరెక్టర్‌ను ట్విటర్‌లో నెటిజన్స్ ఉతికి ఆరేస్తున్నారట. ఇక చప్పగా తేలిపోతున్నట్లుగా ఉండే ఈ మూవీలో రాబర్ట్ నటించడానికి ఎలా ఒప్పుకున్నాడో తెలియడం లేదని కొందరు అభిమానులు పెదవి విరుస్తున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: