మెగా ఫ్యామిలీకి బాగా క్లోజ్ అవుతున్నాడు విజయ్ సేతుపతి. మెగా కాంపౌండ్ లో వరుస సినిమాలు చేస్తూ మెగా ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. చిరంజీవి నుంచి అప్ కమింగ్ హీరోల వరకు అందరితో కలిసి పనిచేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. 

 

విజయ్ సేతుపతికి తమిళనాట క్రేజీ మార్కెట్ ఉంది. ఈ హీరో సమ్ థింగ్ స్పెషల్ స్టోరీస్ నే సెలక్ట్ చేసుకుంటాడని ప్రేక్షకులు కూడా ప్రత్యేక అభిమానం చూపిస్తారు. ఇలాంటి మెసేజ్ ఉన్న విజయ్ మాత్రం మెగా ఫ్యామిలీ హీరోలపై ప్రత్యేక అభిమానం చూపిస్తున్నాడు. వరుసగా మెగా హీరోలతో సినిమాలు చేస్తున్నాడు సేతుపతి. 

 

విజయ్ సేతుపతి మొదట చిరంజీవితో సైరా సినిమాలో కలిసి నటించాడు. ఈ మూవీ తర్వాత చిరంజీవి మేనళ్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతోన్న ఉప్పెన సినిమాకు సైన్ చేశాడు. ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు సేతుపతి. 

 

విజయ్ సేతుపతి తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ సినిమాలో కూడా నటిస్తాడని టాక్ వస్తోంది. ఈ మూవీలో సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సో తెలుగునాట విజయ్ సేతుపతి చేస్తోన్న సినిమాల లిస్ట్ చూస్తే.. ఈ హీరో మెగా ఫ్యాామిలీకి బాగా దగ్గరైనట్టు కనిపిస్తోంది. మొత్తానికి విజయ్ సేతుపతి మెగా ఫ్యామిలీకి ఫెవికాల్ బంధాన్ని ఏర్పరుచుకుంటున్నాడు. వరుస సినిమాలతో  బాగా క్లోజ్ అవుతున్నాడు. ఇప్పటికే చిరంజీవితో సైరా లో నటించి తన మార్క్ ఏంటో చూపించుకున్నాడు. వైష్ణవ్ తేజ్ ఉప్పెనలో విలన్ గా మెప్పించబోతున్నాడు. విజయ్ సేతుపతి వాలకం చూస్తుంటే.. ఆయన మొత్తం చిరంజీవి ఫ్యామిలికి అంకితం అయ్యేటట్టు కనిపిస్తోంది. చిరంజీవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు.. మిగతావారు అల్లు అల్జున్, అల్లు శిరీష్, నాగబాబు తనయుడితో ముందు ముందు కలిసి నటించే ఛాన్సులు ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: