పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా జాన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్ లో మన డార్లింగ్ ఎలా కనిపంచబోతున్నాడో అన్న అత్యుత్సాహం అభిమానుల్లో రోజు రోజుకి  రెట్టింపవుతోంది. సాహోలో లుక్ తో పోలిస్తే ఈసారి ప్రభాస్ పూర్తి మేకోవర్ చూపించబోతున్నారన్న టాక్ ఉంది. జాన్ సినిమాలో లుక్ ఎలా ఉండబోతోంది? అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అందుకు కారణం చిత్ర బృందం ముందునుంచి ఈ సినిమా ప్రీరియాడికల్ జోనర్ లో తెరకెక్కే సినిమా అని చెప్పడమే. ఇక కొత్త సంవత్సరంలో ఇప్పటివరకూ ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. సంక్రాంతి సందర్భంగా నైనాసినిమా అప్ డేట్ ఏదైనా రివీల్ చేస్తారా అని అందరూ ఎదురు చూశారు గాని అది నిరాశగా మిగిలింది. 

 

అయితే తాజాగా డార్లింగ్ తన ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా జాన్ ప్రీలుక్ తరహాలో ఓ పోస్టర్ ని అభిమానులకు షేర్ చేసాడు. జాన్ షూటింగ్ తిరిగి మొదలు పెడుతున్నట్లు వెల్లడించాడు. ఈ షెడ్యూల్ అంతా ఫన్ రైడ్ లా ఉంటుందని ప్రభాస్ అప్‌డేట్ చేశాడు. ఇక ఈ సినిమా న్యూ లుక్ విషయానికి వస్తే ప్రభాస్ కటౌట్ మామూలుగా ఉంటేనే అదుర్స్ అనిపిస్తుంది. పీరియాడిక్ లవ్ స్టోరీ లో క్లాసిక్ స్టైల్లో కనిపించి ఫ్యాన్స్ ని మురిపిస్తున్నాడు. ఆ లుక్ చూడగానే.. ప్రేయసి కోసం వెతుకుతున్న ప్రేమికుడి లా కనిపిస్తున్నాడు. ఒక కోణంలో చూస్తే అజ్ఞాత ప్రేమికుడా .అన్న ఆసక్తి రేకెత్తిస్తుంది. 

 

ఓ విలాసవంతమైన వింటేజ్ భవంతిలో ఏదో ఆలోచిస్తూ ఏటో చూస్తూ అజ్ఞాతవాసిలా ఎంట్రీ ఇచ్చాడు. ఎంతో పురాతన భవంతిలా అక్కడ ఆర్కిటెక్చర్ విలక్షణంగా కనిపిస్తొంది. ఫర్నిచర్..గోడలు..మెట్లు ఇలా పోస్టర్ లో గమనిస్తుంటే పాత కాలంలోకి తీసుకెళుతున్నాయి. 1960 నాటి లవ్ స్టోరీ కాబట్టి అప్పటి వాతావరణాన్ని తలపించేలా వేసిన ఓ సెట్ డిజైన్ అని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్దే నటిస్తోంది. జిల్ ఫేం రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాహో తో గట్టి దెబ్బ తిన్న ప్రభాస్ బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక పూజా వరుసగా హిట్ అందుకుంటూ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుంది. మరి పూజా లక్ ఈ సినిమాకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: