త్రివిక్రమ్ డైలాగులు ఎంత ఫేమసో.. అతని సినిమాల్లో ఫోక్ సాంగ్స్ కూడా అంతే పాపులర్ అవుతున్నాయి. థియేటర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ.. ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. మరుగునపడిపోతున్న జానపదాలు మళ్లీ గంతులేస్తున్నాయి.


త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే బలమైన స్పీచ్ లు, పంచ్ డైలాగులే గుర్తుకొస్తాయి. కానీ ఈ మధ్య త్రివిక్రమ్ సినిమాలు అనగానే జానపదాలు గంతులేస్తున్నాయి. పల్లెపదాలు జనాల మదిలో మెదులుతున్నాయి. సంక్రాంతి హిట్ అల వైకుంఠపురములో వినిపిస్తోన్న సిత్తరాల సిరపుడు పాటైతే ప్రేక్షకులతో విజిల్స్  వేయిస్తోంది. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కలిస్తే అదిరిపోయే కలెక్షన్లే కాదు.. అద్భుతమైన జానపదాలు నాట్యమాడుతున్నాయి. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో కాటమరాయుడా.. కొడకా కోటేశ్వర్రావా.. పాటలే బెస్ట్ ఎగ్జాంపుల్. 

 

ఫ్యాక్షన్ మూవీస్ లో కొంచెం డిఫరెంట్ గా వచ్చిన సినిమా ఆరవింద సమేత. త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ కత్తులు పక్కనపెట్టి, అభివృద్ధి వైపు నడవమని సందేశమే ఇచ్చింది. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలోనే రెడ్డెమ్మ తల్లి అనే రాయలసీమ జానపదాన్ని వినిపించాడు త్రివిక్రమ్. 

 

మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ జానపదాలపై విపరీతమైన ప్రేమను చూపిస్తున్నాడు. ఒక్కసారిగా పల్లె సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టే ప్రయత్నం చేయడంతో పాటు .. ప్రేక్షకుల్లో మంచి ఊపును తీసుకొస్తున్నాడు. పల్లె పాటలను తెరకెక్కించి పంచ్ మాస్టరైపోతున్నాడు. జనాల నోళ్లలో ఆ పాటలు అలా ఉండిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. డైరెక్షన్ తో పాటు మ్యూజిక్ లో కూడా ఆయన తీసుకుంటున్న కేర్ చూస్తుంటే సంగీతంపై ఆయనకున్న మమకారానికి అద్దం పడుతోంది. 

 

అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను ప్రేక్షకులు అంతలా ఇష్టపడుతున్నారు. ఏ సినిమాలో అయినా సంగీతం బాగుంటే ఆ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్నట్టే. అందుకే మ్యూజిక్ కు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు త్రివిక్రమ్. మంచి ఊపున్న జానపద పాటలతో ఆడియన్స్ గంతులేసేలా చేస్తున్నాడు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: