మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సంక్రాంతి బ‌రిలో తెర‌కెక్కిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` అల్లుఅర్జున్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం సూప‌ర్ హిట్ సాధించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం రిలీజైన రోజు నుంచే మంచి హిట్ టాక్‌తో  బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ గా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. ఫస్ట్ డే వార‌ల్డ్ వైడ్‌గా ’అల వైకుంఠపురములో’  దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ రూ. 35 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

 


ఐదో రోజైన కనుమన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 11 కోట్ల వరకు షేర్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.64 కోట్లు.. ఓవర్సీస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా అన్ని కలిపితే ప్రపంచ వ్యాప్తంగా.. రూ. 83 కోట్ల వరకు షేర్...రూ. 125 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఇక‌పోతే అంద‌రి హీరోల‌కు  ఒక క్రేజ్ ఉంటే. అల్లుఅర్జున్‌కి మాత్రం అన్ని భాష‌ల్లోనూ ఆయ‌న‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మిగ‌తా హీరోల‌కి ఆ ఫాలోయింగ్ కాస్త త‌క్కువ‌నే చెప్పాలి. 

 


అల్లుఅర్జున్‌కి మాత్రం ఓవర్సీస్‌లో ఈ సినిమాను సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్లను క్రాస్ చేయడం విశేషం. ‘అల వైకుంఠపురములో’ సినిమా. ఇక ఈ చిత్రం మలయాళంలో  ‘అంగు వైకుంఠపురత్తు’ పేరుతో రిలీజై అక్కడ కూడా సంచలనాలు సృష్టిస్తోంది. అల్లు క్రేజ్ మాములుగా లేదు. ఇక కేర‌ళ‌లో ఆయ‌న ర‌చ్చ మాములుగా లేద‌నే చెప్పాలి. గ‌తంలో కూడా ఒక‌సారి అల్లుఅర్జున్ కేర‌ళ‌కు వెళ్లిన స‌మయంలో ఆయ‌న‌కు చాలా చ‌క్క‌గా స్వాగ‌తం ప‌లికారు. ఎంతో అద్భుత‌మైన గౌర‌వంతో ఆయ‌న్ను ఎంతో బాగా చూశారు. ఇక ఈ చిత్రానికి త‌మ‌న్ అందించిన మ్యూజిక్ కూడా బాగా హిట్ అయింద‌నే చెప్పాలి.  గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: