ఈమద్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు అలాగే షార్ట్ ఫిల్మ్ లకు మంచి డిమాండ్ ఉంటుంది. సినిమాలకి ఏమాత్రం తీసి పోకుండా మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్ ని పాటిస్తూ మంచి కాన్సెప్ట్స్ తో నిర్మిస్తున్నారు. జోనర్ ఏదైనా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వెబ్ సిరీస్ కే ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి ఫాం లో ఉన్న కియారా కూడా లస్ట్ స్టోరీస్ తో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఇక్కడ డబ్బు కంటే కూడా కాన్సెప్ట్ అండ్ ఎక్స్‌పరిమెంట్స్ కే మన స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఫ్యామిలీ మాన్ వంటి సక్సస్ ఫుల్ వెబ్ సిరీస్ వచ్చింది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ కి సీక్వెల్ వస్తోంది.

 

ఈ వెబ్ సిరీస్ లోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత నటిస్తోంది. ఇక లెజెండ్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టైలిష్ విలన్ గా క్లాసీ ఫాదర్ రోల్స్ లో హీరో రేంజ్ క్రేజ్ తో దూసుకుపోతున్న జగపతి బాబు కూడా కొత్తగా రూపొందబోయో వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో జగపతి కండోంస్ ఫ్యాక్టరీ ఓనర్ గా సంచలనమైన పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబే కాదు స్టార్స్ కూడా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. వెబ్ సిరీస్ లను కూడా కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. ఈ సమయంలోనే షార్ట్ ఫిల్మ్ లకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. ఒకప్పుడు అంతా కొత్త వారు మాత్రమే షార్ట్ ఫిల్మ్ చేసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త వారు మాత్రమే కాకుండా స్టార్స్ కూడా షార్ట్ ఫిల్మ్ లు చేస్తున్నారు.

 

అందులో భాగంగా బాలీవుడ్ స్టార్స్ కాజోల్.. శృతి హాసన్.. నేహా దుపియా.. నైనా కుల్ కర్ని.. ముక్త భర్వే.. రమ జోషి.. శివానీ రఘువంశీలు ఈ షార్ట్ ఫిల్మ్ లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆడవారి యొక్క గొప్పతనంను చాటి చెప్పే విధంగా ఈ దేవి షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించామని చెబుతున్నారు. తాజాగా విడుదలైన దేవి ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. విభిన్న తరహా ఆడవారి కలయికతో ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుందని.. ఆడవారికి ఆదర్శంగా కూడా ఉంటుదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు ప్రియాంక బెనర్జీ దర్శకత్వం వహించారు. అతి త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొత్తం ఆడవారితో తెరకెక్కించడం ఒక సాహసం అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: