నందమూరి తారక రామారావు గారి సలహాతో, ఆశీస్సులతో నటన వైపు వచ్చి దేవదాస్ కనకాల దగ్గర నటనలో శిక్షణ తీసుకొని ఆ తర్వాత కామెడీ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో హిట్ చిత్రాలు ఇచ్చారు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇండస్ట్రీకి కంప్లీట్ కామెడీ జోనర్ లో సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకోవచ్చనే పంథాను రాజేంద్రుడే సృష్ఠించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకప్పుడు కామెడీ హీరో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ క్షణం ఖాళీ లేకుండా ఉండేవారు. ఇక గత కొంతకాలంగా కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పెద్ద సినిమాల్లో కనిపిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గతంతో పోల్చితే ఈమధ్య తన పాత్రలతో ఆకట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించారు. రెండు పెద్ద సినిమాలు.. అవి కూడా సంక్రాంతి సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ కనిపించడం అంటే గొప్ప విషయం అని చెప్పాలి.

 

ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారన్న విషయం తెలిసిందే. కాని రాజేంద్ర ప్రసాద్ పాత్రలు మాత్రం సినిమాల్లో సరిగ్గా పేలలేదు. రాజేంద్ర ప్రసాద్ దర్శకులు చాలా తేలికైన, బలం లేని పాత్రల్లో చూపించడంతో పాటు ఏదో కూరలో కరివేపాకు పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్ నటింపజేశారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు పక్కన ఉండే పాత్ర అయినప్పటికి అంతగా ప్రాముఖ్యత లేదు. ఉన్న కొన్ని సీన్స్ లో రాజేంద్ర ప్రసాద్ నవ్వించడంలో ఫ్లాప్ అయ్యారు. వాస్తవంగా చూస్తే రాజేంద్రుడికి ఇవి కొట్టిన పిండి లాంటివి. కానీ లోపం ఎక్కడుందో ఎవరి దగ్గర ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలోనూ రాజేంద్ర ప్రసాద్ ఒక సాదా సీదా పాత్రలో కనిపించి పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ మంచి కామెడీ సీన్స్ చేశారు. కాని ఇప్పుడు ఆయన స్టామినా అయ్యిపోయిందా లేదంటే ఆయన్ను దర్శకులు వినియోగించుకోలేకపోతున్నారా అంటూ నెటిజన్స్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి సినిమాలు సక్సెస్ అయినప్పటికి నటకిరీటికి మాత్రం ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ఇప్పటి నుంచైనా రాజేంద్ర ప్రసాద్ తన స్టామినా కి తగ్గ పాత్రలు చేస్తే బావుంటుంది. ఇక ఆయనకి దేవదాస్ కనకాల దగ్గర యాక్టింగ్ స్కూల్ లో పరిచయమైన మెగాస్టార్ తో పరిచయం ఈనాటికి కొనసాగుతుంది. అంతేకాదు ఆ యాక్టింగ్ స్కూల్ లో మెగాస్టార్ కి రాజేంద్ర ప్రసాద్ సీనియర్ అన్న విషయం అలాగే రాజేంద్రుడికి మెగాస్టార్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు. ఈ రోజుకి ఇద్దరు స్టార్ డం ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాలు పంచుకోవడం గొప్ప విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: