యాంకర్ రవి అంటే తెలియని వారుండరు.. బుల్లితెరపై తనదైన మాటల చేతలతో అభిమానుల్ని సంపాదించుకున్న రవి చేసిన పటాస్ షో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఈటీవీ లో జరిగే కామెడీ షో లలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే యాంకర్ రవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. స్టేజిపై అదిరిపోయే రేంజ్ లో పంచులు వేస్తూ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండే రవి యాంకరింగ్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. అందులో అమ్మాయిలు కూడా అభిమానులుగా ఉండటం విశేషం..

 

 

ఇక అసలు విషయం ఏంటంటే ఇటీవల విడుదలైన లోకల్ గ్యాంగ్స్ ప్రోమోలో తేజస్వి మదివాడతో రవి అదిరిపోయే రొమాన్స్ చేస్తూ డాన్స్ చేసిన ప్రోమో రిలీజ్ అవటంతో ఇద్దరు వేసిన డాన్స్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అయ్యి రవి రెచ్చిపోయాడు గా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది అని యాంకర్ రవి.. తేజస్వి మదివాడ తో కలిసి వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు, రవి అభిమానులు పండగ చేసుకుంటున్నారట.

 

 

లోకల్ గ్యాంగ్స్ షోకి ముందుగా విడుదలైన ఈ ప్రోమో చూసి చాలామంది రవి పర్ఫామెన్స్ హ్యట్సాఫ్ అంటూ కాంప్లీమెంట్స్ ఇస్తున్నారట. ఇకపోతే కత్తి లాంటి టాప్ హీరోయిన్ రవి తో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. ఇక జీ తెలుగు ఛానెల్‌లో ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈ ‘లోకల్ గ్యాంగ్స్’ కామెడీ షో కు ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా అనసూయ, జానీ మాస్టర్ జడ్జిలుగా వస్తున్నారట...

 

 

ఇదే కాకుండా రవి, ప్రదీప్‌ల కామెడీ వెరసీ ‘లోకల్ గ్యాంగ్స్’ లోకల్ పబ్లిక్‌కు తొందర్లనే రీచ్ అయింది. తాజాగా లోకల్ గ్యాంగ్స్ షో తో అనసూయ తన  రేంజ్‌ పెంచుకునే పనిలో పడింది.  మొత్తానికి లోకల్ గ్యాంగ్స్ లో అనసూయ చేసే కామెడీ జబర్దస్త్ షోను మించి పోయిందనే టాక్ వినబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: