టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా నటించిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. వరుసగా నాలుగు హిట్ సినిమాలని తెరకెక్కించిన అనిల్ రావుపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్స్ పరంగా ఓకె అనిపించుకుంటూ దూసుకుపోతోంది. ఇక సీనియర్ నటి విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సుబ్బరాజు, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సంగీత వెన్నెలకిషోర్, సత్యదేవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించి సందడి చేశారు. ఇక సూపర్ స్టార్ సరసన నటించిన హీరోయిన్ రష్మిక పెద్ద మైనస్ అన్న టాక్ వినిపిస్తోంది.

 

ఛలో, గీత గోవిందంతో సినిమాలతో సక్సస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక .. డియర్ కామ్రేడ్ తో మాత్రం డిజాస్టర్ ని అందుకుంది. లిల్లిగా నటించి ఆకట్టుకోలేకపోయింది. అసలు రష్మిక ఆ సినిమాలో ఏమంత అందంగా కనిపించకపోవడం ఒక మైనస్ అయింది. అయినా రష్మిక లోని టాలెంట్ కి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా మంచి ఛాన్స్ అందుకుంది. ఇక మహేష్ తో రష్మిక అనగానే ప్రేక్షకులు ముందే కాస్త డిఫ్రెంట్ గా ఫీలయ్యారు. అయితే రష్మిక మాత్రం అదేదో పెద్ద కల నిజమైనట్టు ఫీలయైంది. ఇక సినిమా విడుదలైనప్పుడు సక్సెస్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ పరంగా బెస్ట్ అనిపించుకుంది. కానీ ఈ సినిమాలో రష్మిక పాత్ర తేలిపోవడమే కాదు... రష్మిక కూడా ప్రేక్షకులకు కాస్త కూడా నచ్చలేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రష్మిక క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి. అంతేకాదు సరిలేరు నీకెవ్వరు లో రష్మిక ఓవర్ యాక్షన్ కూడా పెద్ద మైనస్ అయిందని మహేష్ ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. 

 

మరి గ్లామరస్ డాల్ కాకపోయినప్పటికి ఛలో, గీత గోవిందం సినిమాలలో రష్మికకి మంచి పేరొచ్చినప్పటికి.... సరిలేరులో మాత్రం తన పాత్రని అనిల్ రావిపూడి డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులకు ఎంతమాత్రం నచ్చకపోవడం.. సూపర్ స్టార్ ముందు మరీ చిన్న పిల్లలా కనిపించడంతో రష్మిక ఈ సినిమాలో నిజంగానే తేలిపోయింది. అందులోను సరిలేరు మైనస్ పాయింట్స్ లో రష్మిక పేరు ముందు ఉంది. అయితే ఈ మాట అటు తిరిగి ఇటు తిరిగి రష్మిక కి చేరడంతో బాగా అప్సెట్ అయిందట. అయితే దర్శకుడు నా పాత్రను అలా డిజైన్ చేస్తే నేను మాత్రం ఏం చెయ్యాలి అంటూ వాపోతుందట. మరి రష్మిక నటిస్తున్న తాజా సినిమా భీష్మ లోనైనా ఈ అపవాదుని తొలగించుకుంటుందా చూడాలి. నితిన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: