స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లో తెరకెక్కిన ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ ని సొంతం చేసుకుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చి మంచి సక్సస్ ని అందుకున్నాయి. దాంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసకి నెలకొంది. దానికి తోడు అల నుంచి థమన్ ఇచ్చిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా జనవరి 12 న రిలీజై సక్సస్ ఫుల్ గా దూసుకుపోతోంది.

 

‘అల... వైకుంఠపురంలో’ సినిమాకి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ మాములూగా లేదు. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది. ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం ఆశ్చర్యకరం ఆసక్తికరం. ఇక ఈ సినిమా ఇంత పెద్ద సక్సస్ సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ సినిమా విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు. 

 

జనవరి 19న వైజాగ్ లో 'అల వైకుంఠపురంలో' సక్సెస్ సెలబ్రేషన్ గ్రాండ్ గా చేయబోతున్నారట. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా అల వైకుంఠపురంలో  నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా సరిలేరు తో పోటీగా దిగిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ అందుకుందని ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. 

 

 గత సంవత్సరం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తో ఉన్న అల్లు అర్జున్ కి ఈ సినిమా మంచి బూస్టప్ అని అంటున్నారు. హిట్ అవుతుందని అనుకున్నారు గాని ఈ రేంజ్ హిట్ అవుతుందని ఏవరూ ఊహించలేదు. అయితే అందుకు కారణాలు లేకపోలేదు. సరిలేరు యావరేజ్ టాక్ రావడం, రజనీకాంత్ దర్బార్ ని ఎవరూ పట్టించుకోకపోవడం, అలాగే కళ్యాణ్ రాం ఎంత మంచి వాడవురా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో అందరూ అల మీదే దృష్ఠి పెట్టారు. అందరికీ అల ఒక్కటే ఆప్షన్ అయిపోయింది. దాంతో ఈ సంక్రాంతికి పెద్ద హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: