ప్రస్తుతం సెల్ ఫోన్స్ వంటివి వినియోగం ఎక్కువ అవడంతో పాటు, సోషల్ మీడియా మాధ్యమాలను దాదాపుగా చాలా మంది వాడుతుండడంతో సెలబ్రిటీలు సైతం వాటిలో అకౌంట్స్ క్రియేట్ చేస్తూ, తమ అభిమానులకు చేరువ అయ్యేందుకు వాటిని ప్లాట్ ఫామ్స్ గా చేసుకుంటున్నారు. ఇక ఆ విధంగా ఎప్పుడో 2005లో వచ్చిన బాలీవుడ్ సినిమా షాదీ నెంబర్ 1 తో బాలీవుడ్ కి నటిగా ఎంట్రీ ఇచ్చిన యుకె భామ సోఫి చౌదరి, అంతకముందు లండన్ లోని జీ టీవీ లో ఒక ప్రోగ్రాం కు వ్యాఖ్యాతగా పని చేసింది. ఇక బాలీవుడ్ లో ఎంట్రీ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించిన సోఫీ, తన కెరీర్ లో ఎక్కువగా స్పెషల్ అపియరెన్స్ ఇచ్చే పాత్రలు, సాంగ్స్ లోనే నటించింది. 

 

ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి 2014లో రిలీజ్ అయిన వన్ నేనొక్కడినే అనే సినిమాలో లండన్ బాబు అనే స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకుల మదిని దోచిన సోఫీ, ఆ తరువాత కొన్ని టివి షోల్లో నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇక స్వతహాగా విదేశీ యువతి కావడంతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫాషన్ ట్రెండ్స్ ని ఫాలో అయ్యే సోఫీ, తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా సంగతులు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే నేడు ఆమె బ్లూ కలర్ బికినీ ధరించి సముద్రం మీద తన అందాలు ప్రదర్శిస్తూ దిగిన ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. 

 

ఇక ఆమె హాట్ గా దిగిన ఆ బికినీ ఫోటోలపై వావ్ చాలా హాట్ గా ఉన్నారు, మీరు మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాం అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 37 ఏళ్ళ వయసున్న సోఫీ చౌదరి కెరీర్ పరంగా మాత్రం తనకు సరైన బ్రేక్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తోంది. మరి రాబోయే రోజుల్లో అయినా ఆమెకు సరైన సినిమా, అలానే సక్సెస్ లభిస్తాయో లేదో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: