మిల్కీబ్యూటీ త‌మ‌న్నా పాలుగారే అందంతో తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఉంది. ఇక ఈ భామ‌కు ఆ మ‌ధ్య అవ‌కాశాలు కాస్త త‌క్కువ‌యినా మ‌ళ్ళీ ఇప్పుడు ఓ రేంజులో త‌మ‌న్నా హ‌వా న‌డుస్తుంద‌నే చెప్పాలి. ఇటీవ‌లె చిరంజీవి చిత్రంలో సైరా న‌ర్సింహారెడ్డి లో ఓ కీల‌క పాత్ర‌ను పోషించి ఎంతో అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. ఆ చిత్రంలో త‌న పాత్ర‌కు చాలా మంచి పేరు వ‌చ్చింద‌నే చెప్పాలి. అలాగే ఇటీవ‌లె విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో డాంగ్ డాంగ్...డాంగ్ అంటూ ఓ గెస్ట్ సాంగ్‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. 

 

ప్ర‌స్తుతం త‌మ‌న్నా గోపిచంద్‌తో క‌లిసి క‌బ‌డ్డీ నేప‌ధ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ముందుగా సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి నటించిన ‘ఎఫ్2’ తో మంచి సక్సెస్ అందుకుంది. గతంలో తమన్నా సంపత్ నంది డైరెక్ట్ చేసిన ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల్లో మెరిసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ముచ్చటగా మూడోసారి సంపత్ నంది దర్శకత్వంలో యాక్ట్ చేయబోతుంది. ఆంధ్రా మహిళల కబడ్డీ కోచ్‌గా కనిపించబోతున్నాడట. తమన్నా తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్‌గా దర్శనమిస్తుంది. 

 

సినిమా కోసం 25 మంది కబడ్డీ ఆటగాళ్ళతో పాటుగా మరికొంత మంది కొత్త నటులను తీసుకున్నారట. ఈ పాత్ర కోసం గోపిచంద్, తమన్నా ప్రత్యేకంగా కసరత్తులు చేసి మరి సన్నద్దం అయ్యారని తెలుస్తుంది. ఇక ఈ భ‌మ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తోంది. పూల పూల గౌనులో పూవుల్లో పూవై విరిసి ఒక అంద‌మైన స్టిల్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. గౌను చిన్న‌దైనా కూడా చాలా పువ్వుల‌తో ఎంతో అందంగా ఆక‌ర్షిణీయంగా ఉంది. అందులోనూ త‌మ‌న్నా వేసుకుంటే ఆ గౌనుకే అంద‌మొచ్చిన‌ట్లుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: