టాలీవుడ్ లో క్రేజీయస్ట్ స్టార్ హీరోల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారు. వీరిద్దరూ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా RRR. రీల్ లైఫ్ లో పోటీ ఉన్నా రియల్ లైఫ్ లో వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. తమ స్నేహంపై రామ్ చరణ్ ఇటివల టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. యంగ్ టైగర్ తారక్ ను ఓ ఫైర్ క్రాకర్ గా చరణ్ అభివర్ణించాడు. సెట్లో ఎంతో సరదాగా, ఎనర్జటిక్ గా ఉంటాడు. సెట్లో తారక్ లేకపోతే తనకు ఏమీ తోచదని ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు.

 

 

ఇద్దరు గొప్ప యోధుల పాత్రల్లో నటిస్తున్నామనీ.. మొదటి నుంచీ తమ మధ్య ఉన్న స్నేహం తాము కలిసి నటించడానికి ఎంతో ఉపయోగపడిందని అన్నాడు. ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాని చెప్పాడు. ఉత్తరాంధ్రకు అల్లూరి సీతారామరాజు ఎంత చేశారో తెలంగాణకు కొమరం భీమ్ అంతే చేశారని ఇటువంటి పాత్రలు చేయడం అదృష్టమని చెప్పుకొచ్చాడు. తనకు జోడీగా నటిస్తున్న అలియా భట్ తో ఇంకా పని చేయలేదని.. ఎంతో ప్రతిభ గల అలియాతో నటించేందుకు ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. స్వశక్తితో ఎదిగిన అలియా అంటే తనకు గౌరవముందన్నాడు.

 

 

అల్లూరి పాత్ర ఎంతో శక్తివంతమైనదని.. ఇది తనకో ప్రత్యేకమైన పాత్ర అని చరణ్ అన్నాడు. ఈ పాత్ర చేయడం తనకు దక్కిన గౌరవమన్నాడు. ఈ పాత్ర చేయడానికి తాను హోంవర్క్ చేశానని, ఇందుకు వర్క్ షాప్స్ లో కూడా పాల్గొన్నట్టు తెలిపాడు. ఎప్పుడూ పాత్ర బలాన్ని తనపై వేసుకోనని.. ఇప్పుడు కూడా రాజమౌళికి తాను సరెండర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అలా చేసి గతంలో తప్పులు చేశానన్నాడు. రంగస్థలంలో వినికిడిలోపం ఉన్న పాత్రకు ఎలా శిక్షణ తీసుకున్నావని చాలామంది అడిగారని.. కానీ తాను ఎటువంటి సాధన చేయలేదని చెప్పాడు మెగా పవర్ స్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: