టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌, నాగ‌చైత‌న్య వీరిద్ద‌రూ ఎంత స్వీట్ క‌పులో కొత్త‌గా చెప్పుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఇక‌పోతే వారిద్ద‌రూ ఇష్ట‌ప‌డి పెళ్ళి చేసుకున్న విష‌యం తెలిసిందే. స‌మంత‌కు గోవా అంటే చాలా ఇష్టం. ఏ అకేష‌న్ అయినా గోవాకి వెళ్లి చేసుకోవాల్సిందే. బ‌ర్త్‌డే అయినా, పెళ్లి రోజు అయినా అంత‌గా గోవా లోనే. ఇటీవ‌ల చైతూ బ‌ర్త్‌డేని, పెళ్లి రోజుని, న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ని అక్క‌డే చేసుకున్నారు. తాజాగా న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ని చైతూ, సామ్ క‌లిసి గోవాలోనే సెల‌బ్రేట్ చేసుకున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంతలు ఏడేళ్ల ప్రేమాయ‌ణం త‌రువాత ఇరుకుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరి వివాహం గోవాలోనే జ‌రిగింది.

 

గోవా అంటే ప్ర‌త్యేక ఇష్టాన్ని ప్ర‌ద‌ర్శించే స‌మంత సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నాక త‌న‌కు ఇష్ట‌మైన ప్లేస్ గోవాలోనే వుండాల‌నుకుంటోంద‌ట‌. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఓ ప్లేస్‌ని కూడా కొనుగోలు చేసింద‌ట‌. అక్క‌డే ఓ సూప‌ర్ విల్లాని సీ వ్యూతో ఐశ్వ‌ర్యారాయ్‌, షారుఖ్‌ల త‌ర‌హాలో నిర్మించుకోవాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌. సామ్ ప్ర‌స్తుతం `96` ఆధారంగా రూపొందుతున్న `జాన్‌` చిత్రంతో పాటు హిందీ వెబ్‌సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ 2`లో న‌టిస్తోంది. ఇక ఈ భామ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనే ఓ రేంజ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. స‌మంత పెళ్ళైన ద‌గ్గ‌ర నుంచి తాను న‌టించే చిత్రాల‌న్నీ కూడా క‌థా బ‌ల‌మున్న‌చిత్రాల‌ను ఎన్నుకుంటుంది. 


అలాగే లేడీ ఓరియంటెడ్ క్యారెక్ట‌ర్స్‌కి ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తుంది. త‌ను న‌టించిన యుట‌ర్న్‌, ఓ బేబి ఇంకా ఇలాంటి చిత్రాల‌న్నీ మంచి హిట్ టాక్‌ను సంపాదించుకున్నాయి. అలాగే ఇటీవ‌లె స‌మంత‌, చైత‌న్య క‌లిసి న‌టించిన మ‌జిలీ చిత్రం కూడా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది. ఇక పెళ్ళైన ద‌గ్గ‌ర నుంచి వీరిద్ద‌రికీ కూడా కెరియ‌ర్ ప‌రంగా బాగానే క‌లిసొస్తుంద‌ని చెప్పాలి. ఎలాంటి అడ్డంకులు లేకుండా హిట్‌ల మీద హిట్‌లు కొడుతూ వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: