నిన్ను ఛూడాలని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీయార్. బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాల్లో నటించిన ఎన్టీయార్ స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో తొలి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జూనియర్ ఎన్టీయార్ వివి వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్ బేస్ ను పెంచటంలో సహాయపడింది. 
 
ఆది సినిమా తరువాత జూనియర్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సింహాద్రి సినిమాతో జూనియర్ ఎన్టీయార్ మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటు జూనియర్ ఎన్టీయార్ రేంజ్ ను అటు రాజమౌళి రేంజ్ ను పెంచటంతో పాటు జూనియర్ ఎన్టీయార్ మార్కెట్ భారీగా పెరగటంలో సింహాద్రి పాత్ర చాలానే ఉంది. ఆ తరువాత జూనియర్ కొంతకాలం ఫ్లాపులు, యావరేజ్ హిట్లతో సరిపెట్టుకున్నా యమదొంగ సినిమాతో జూనియర్ ఎన్టీయార్ రాజమౌళి కాంబో మరోసారి మ్యాజిక్ చేసింది. 
 
ఆ తరువాత అదుర్స్, బృందావనం సినిమాలతో మోస్తరు హిట్లు అందుకున్న ఎన్టీయార్ బృందావనం తరువాత నటించిన ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రొటీన్ మాస్ కథలు ఎంచుకోవడం, దర్శకులు ఎన్టీయార్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వలన జూనియర్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయంలో ఎన్టీయార్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ సినిమాతో ఎన్టీయార్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. 
 
టెంపర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఎన్టీయార్ కెరీర్ ను టర్న్ చేసిన సినిమాగా ఈ సినిమాను ఎన్టీయార్ అభిమానులు చెప్పుకుంటారు. టెంపర్ తరువాత ఎన్టీయార్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ఎన్టీయార్ ను ఏ సెంటర్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. జూనియర్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా జూనియర్ ఎన్టీయార్ మార్కెట్ ను భారీగా పెంచింది. అరవింద సమేత వీర రాఘవ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీయార్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. జూనియర్ ఎన్టీయార్ కెరీర్ ను టర్న్ చేసిన సినిమాలుగా ఆది, సింహాద్రి, యమదొంగ, టెంపర్, జనతా గ్యారేజ్ సినిమాలను చెప్పవచ్చు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: