పవన్ కళ్యాణ్ చాల ఆవేశంగా మాట్లాడుతాడు. రాజకీయాలలో ఆవేశం కంటే ఆలోచనలు వ్యూహాలు ముందు చూపు చాల అవసరం. అయితే మొన్న పవన్ ‘జనసేన’ ‘భారతీయజనతా పార్టీ’ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన జరిగిన చర్చలలో ఆవేశంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అతడికి మెడకు చుట్టుకుంటున్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

భారతీయ జనతాపార్టీ ప్రచారానికి వారి రాజకీయ అవసరాలకు తాను ఎప్పుడు పిలిచినా రెడీ అంటూ పవన్ ఆవేశంగా భారతీయ జనతాపార్టీ నాయకులకు వాగ్దానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మాటలను ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22 జరగబోతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో తమకు పవన్ ప్రచారం చేసి సహకరిస్తే పవన్ అభిమానులు అంతా తమ పార్టీకి ఓట్లు వేస్తారు అంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన భారతీయ జనతాపార్టీ కీలక నేతలు ఇప్పుడు పవన్ తో రాయబారాలు చేస్తూ పవన్ ను తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి రమ్మని ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ అనుకోని పరిణామానికి పవన్ కూడ షాక్ అయి తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలా వద్దా అన్న అంతర్మధనంలో ఉన్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ను ఇప్పటి వరకు తనకు తమ్ముడు అంటూ అభిమానంగా పిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఇప్పుడు పవన్ కు కొత్త ట్యాగ్ ను తగిలించాడు. 

లేటెస్ట్ గా జనసేన బీజేపీ పొత్తుపై కామెంట్ చేస్తూ పవన్ అధికార కాంక్ష పై మండిపడటమే కాకుండా పవన్ కి పవర్ హంగ్రీ పెరిగిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. దీనితో జరుగుతున్న ఈ పరిణామాలను చూసి పవన్ భారతీయ జనతాపార్టీకి బాసటగా నిలిచే విషయంలో తీసుకున్న పవన్ హడావిడి నిర్ణయాలు పవన్ త్వరలో నటించబోయే సినిమాల ఫలితం పై ప్రభావం చూపెడతాయా అంటూ కొందరు విశ్లేషకులు తమ సందేహాలను వ్యక్త పరుస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: