రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.  ఓటమి ఎరుగని ధీరుడిగా రాజమౌళి చరిత్ర సృష్టించాడు.  ఎంతటి గొప్ప దర్శకుడికైనా కనీసం కెరీర్లో ఒక్క పరాజయం అయినా ఉంటుంది.  కానీ, రాజమౌళికి అపజయం లేదు.  ఎవరితో సినిమా తీసినా సరే అది బంపర్ హిట్ కావాల్సిందే.  ఇప్పుడు దాదాపుగా రూ. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు.  అదే ఆర్ఆర్ఆర్.  ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే.  


సినిమా విషయంలో రాజమౌళి టైటిల్ ప్రకటించకుండా ఇలా దాచిపెట్టడం ఇదే మొదటిసారి.  ఎప్పుడు కూడా సినిమా టైటిల్ ప్రకటించి సినిమాలోని కంటెంట్ కూడా సూచనామాత్రంగా చెప్పేవారు.  కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం రాజమౌళి అలా చేయడం లేదు.  ఎందుకు ఏంటి అనే విషయాలు పక్కన పెడితే, రాజమౌళి చేస్తున్న ఈ పని పెద్దగా నచ్చడం లేదు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ చాల ఫీల్ అవుతున్నారు.  


టైటిల్ ప్రకటించలేదు సరే, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కానీ, లుక్స్ కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు.  ప్రతి పండగకు ఏదైనా ఒకటి రిలీజ్ చేస్తారని అనుకున్నారు.  కానీ, రిలీజ్ చేయకపోగా అసలు ఇంత గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారో అర్ధంకావడం లేదు. ఇప్పటికే 75శాతం షూటింగ్ పూర్తయింది.  ఇంతటి సినిమా పూర్తయినా ఇప్పటి వరకు టైటిల్ ప్రకటించలేదు అంటే దాని గురించి ఏమనుకోవాలో అర్ధం కావడం లేదు.  


బాహుబలికి రాజమౌళి చేసిన ప్రచారం అంతాఇంతా కాదు, కానీ, ఈ సినిమాకు అంతటి ప్రచారం జరగడం లేదన్నది కొందరి వాదన.  ఎందుకని ప్రచారం నిర్వహించడం లేదో తెలియడం లేదు.  ప్రచారం నిర్వహించకుండా సైలెంట్ గా ఉంచుతున్నారు.  అన్ని సినిమాలకు ఇది భిన్నం కాబట్టి ఇప్పటి నుంచే ప్రచారం చేయాలి.  కనీసం జనవరి 26 వ తేదీ అయినా ఏదైనా లోక్ రిలీజ్ చేస్తారా లేదంటే అప్పుడు కూడా హ్యాండ్ ఇస్తారా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: