నటన అనేది వంశ పారంపర్యంగా వస్తుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు నటిస్తున్న చాలా మంది కుర్ర హీరోల్లో సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి వారిలో విజయ్‌దేవరకొండ ఒకరు. పెళ్లి చూపులుతో ప్రేక్షకుల చూపులు తన వైపు తిప్పుకున్న విజయ్‌దేవరకొండ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో రెంజ్‌కు ఎదిగాడు. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతే కాకుండా తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తో ఫుల్ క్రేజీను సొంతం చేసుకున్నాడు.

 

 

అదిసరే ఒక ఇంటిలో ఒక స్టార్ హీరో ఉంటే ఆ ఇంటిలో ఉన్న మగవారందరు హీరోలుగా ఎదగాలని లేదు. వారి వారికున్న నైపుణ్యతనుబట్టి వివిధరంగాల్లో రాణించవచ్చు. అయితే ఏదో ఒక ప్రయోగం చేసి చూద్దాం అని ఇండస్ట్రీకి వచ్చి చేతులు కాల్చుకున్న వారూ ఉన్నారు. ఇకపోతే ఈ ఈ క్రేజీ హీరో తమ్ముడు ‘ఆనంద్ దేవరకొండ’ గురించి చెప్పుకుంటే దొరసాని’తో హీరోగా మారిన కనీస స్థాయిలో కూడా మెప్పించలేక పోయాడనే టాక్ వినిపిస్తుందట..

 

 

సినిమా బలమైన నేపథ్యంలో భావేద్వేగమైన ప్రేమ కథతో వచ్చిన, ఆనంద్, యాక్టింగ్ పరంగా పూర్తిగా తేలిపోయాడంటున్నారు. ఇక పూర్తిగా నటనకు సంబంధించి ఓనమాలు కూడా నేర్చుకోకుండానే ఆనంద్ ప్రస్తుతం రెండవ సినిమా చేస్తూనే.. మూడవ సినిమాని కూడా లైన్ లో పెట్టాడట. ఇక ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ దామోదరర్ అట్టాడ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా విషయంలో ఆనంద్ దేవరకొండ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడట. ఎందుకంటే హీరో పాత్రలో భిన్న కోణాలు ఉంటాయని తెలుస్తోంది..

 

 

ఈ విషయం గురించి తెలిసిన కొందరు మాత్రం ఎన్ని కోణాలు ఉంటే ఏం లాభం.. మనోడికి ఎలాగూ యాక్టింగ్ రాదుగా అని అనుకుంటున్నారట. ఇకపోతే ఆనంద్ దేవరకొండకి మొదటి చిత్రంలో  లభించిన పాత్రలో మంచి ఎమోషన్ని పండించే అవకాశం పుష్కలంగా ఉన్నా.. తను మాత్రం మాట్లాడితే పళ్ళు మొత్తం కనబడేలా ఇకిలించడం.. బలమైన ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బ్లాంక్ పేస్ తో సింగిల్ రియాక్షన్ తో సరిపెట్టడం,. డాన్స్ పరంగా కూడా ఆకట్టుకోలేక పోయాడు..

 

 

డైలాగులకు తగ్గట్లు ఎక్స్ ప్రెషన్స్ పలికించాడా అంటే.. ఆ విషయంలో అయితే మరీ ఘోరం.. మరి తన అన్నయ్య సపోర్ట్ తో వస్తోన్న ఈ సినీ అవకాశాలను ఆనంద్ దేవరకొండ ఈ సారైనా సద్వినియోగ పరుచుకుని హిట్ కొడతాడా లేడా అనేది కాస్త అయోమయంగానే ఉందట..

మరింత సమాచారం తెలుసుకోండి: