రాజమౌళి ఒకసారి ఒకరి నమ్మి పాత్ర ఇస్తే... ఆ పాత్రకు అయన ప్రాణం పోశాడు అంటే చాలు... ఆయనతోనే మరలా మరలా సినిమాలు చేయడానికి సదా సిద్ధంగా ఉంటాడు.  ఆ విషయం అందరికి తెలిసిందే.  అందుకే రాజమౌళి సినిమాలు ఎప్పుడు హిట్ కొడుతూనే ఉంటాయి.  సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తోనూ, రామ్ చరణ్, ప్రభాస్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు.  ఈగ సినిమాలో విలన్ రోల్ చేసిన సుదీప్ కు ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చారు.  


సినిమా తరువాత తీసిన బాహుబలి సినిమాలో కూడా సుదీప్ ను తీసుకున్నారు.  ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా సుదీప్ ను తీసుకున్నారని తెలుస్తోంది.  సుదీప్ కోసం ఈ సినిమాలో రాజమౌళి ఓ పాత్రను సృష్టించారు.  అదే పోలీస్ పాత్ర.  ఈ పాత్రలో సుదీప్ జీవించారని తెలుస్తోంది.  సుదీప్ కొత్తగా నటించాల్సిన అవసరం లేదు.  అయనకు పాత్ర ఇస్తే చాలు అందులో పరకాయ ప్రవేశం చేస్తారు.  


సినిమాకు ప్రాణం పోస్తారు.  అందుకే ఆయనను సినిమా కోసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.  ఇక ఇదిలా ఉంటె, రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే 75శాతానికి పైగా పూర్తయింది.  సినిమా విషయంలో ఫ్యాన్స్ నెగెటివ్ గా ఆలోచిస్తున్నారు.  ఎందుకంటే, రాజమౌళి గత సినిమాలకు మొదటి నుంచే ప్రమోషన్ చేసేవారు.  కానీ, ఈ సినిమా విషయంలో చాలా గోప్యంగా సినిమా షూటింగ్ జరుగుతున్నది.  ఎందుకు అంతటి గోప్యంగా ఉంచుతున్నారో అర్ధం కావడం లేదు. 


ఇక ఈ సినిమా జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  అంటే ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నది.  వచ్చే నెలతో షూటింగ్ పూర్తవుతుంది.  ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక మిగిలిన ఐదు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మీదనే దృష్టి పెడతారట.  సినిమా టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారు అన్నది మాత్రం యూనిట్ తెలియజేయడం లేదు.  ఎందుకు గోప్యంగా ఉంచుతుందో కూడా తెలియడం లేదు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు కాబట్టి టైటిల్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: