మొన్నటితో సంక్రాంతి పండుగ ముగిసి పోవడంతో ఈ వీక్ ఎండ్ ను సాధ్యమైనంత  ఎక్కువ స్థాయిలో ఉపయోగించుకుని అల్లు అర్జున్ కలలుకంటున్నా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్కును తన ‘అల వైకుంఠపురములో’ ద్వారా అందుకోవడానికి మరో మాష్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అల’ మూవీ చూడటానికి చూడడానికి ఇప్పటివరకు టీవీ లకు హత్తుకుపోయిన ఫ్యామిలీ ప్రేక్షకులు అంతా క్యూ కడుతున్న పరిస్థితులలో సంక్రాంతి పండుగ ముగిసినా ‘అల’ టికెట్స్ దొరకని పరిస్థితి కొనసాగుతోంది.

ఇలాంటి పరిస్థితులలో తన సినిమాకు ఏర్పడ్డ మ్యానియాను కలక్షన్స్ గా మార్చుకోవడానికి బన్నీ ‘అల టీమ్ తో కలిసి ఒక మాష్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలలోని పట్టణాలు అయిన ఏలూరు కాకినాడ రాజమండ్రి లాంటి పట్టణాలలో ‘అల వైకుంఠపురములో’ మూవీ కోసం ఎక్స్ ట్రా మార్నింగ్ షోలు వేయడానికి మిగతా హీరోల సినిమా ధియేటర్స్ ను అదేవిధంగా ‘సరిలేరు’ ధియేటర్స్ ను కూడ వాడుకుని ‘అల’ మూవీకి ఎక్స్ ట్రా మార్నింగ్ షోలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ముఖ్యంగా కోస్తా జిల్లాలలోని అనేక పట్టణాలలో ఈ ట్రెండ్ కొనసాగినట్లుగా తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ పద్ధతిలో ఏలూరు పట్టణంలో 10 షోలు ఎక్కువగా వేస్తే కాకినాడ రాజమండ్రి పట్టణాలలో 8 షోలు ఎక్కువగా పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

‘సరిలేరు’ మూవీ ధియేటర్స్ తో పాటు మిగతా హీరోల సినిమాలకు సంబంధించిన ధియేటర్స్ లో కూడ ఈ ట్రెండ్ కొనసాగినట్లు ఈ పద్ధతి ఈ వీకెండ్ వరకు కొనసాగబోతోంది అన్న లీకులు వస్తున్నాయి. ఒక వైపు డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉంటే టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘అల వైకుంఠపురములో’ యూనిట్ వర్గాలు ఇంకా ఎందుకు విజయోత్సవ సభలు ఏర్పాటు చేయలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు బన్నీ అభిమానులు కూడ ఆశ్చర్యపోతున్నారు.. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: