కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజేంద్రప్రసాద్ ఆ తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి నాన్న అన్న పెదనాన్న పాత్రలకు చిరునామాగా మారాడు. ‘నాన్నకు ప్రేమతో’ ‘జులాయ్’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘మహానటి’ ‘ఎఫ్ 2’ వంటి పలు సినిమాలలో అద్వితీయమైన నటనను ప్రదర్శించిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాల బిజీ ఆర్టిస్ట్.  

ఇలాంటి బిజీ ఆర్టిస్టుకు ఈ ఏడాది సంక్రాంతి కలిసి రాలేదా అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి రేస్ కు తలబడ్డ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల టాక్ ఎలా ఉన్నా ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండుగ హడావిడి పూర్తి అయ్యేలోగా ఈ మూవీ బయ్యర్లు చాల చోట్ల బ్రేక్ ఈవెన్ కు వచ్చేశారు అన్న ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ టాక్ ఎలా ఉన్నా ఈ మూవీకి వస్తున్న కలక్షన్స్ చాల మందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. విలక్షణ నటుడుగా పేరు కాంచిన రాజేంద్రప్రసాద్ ‘సరిలేరు’ ‘అల’ సినిమాలు రెండింటిలోను నటించినా అతడి నటనను విమర్శకుల నుండి కి సాధారణ ప్రేక్షకుల వరకు ఎవరు పట్టించుకోకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

‘సరిలేరు’ మూవీలో రాజేంద్రప్రసాద్ మహేష్ పక్కన ఆర్మీ ఆఫీసర్ గా ‘ప్రసాదు గారు’ పాత్రలో కనిపించాడు. ఇక ‘అల’ మూవీలో రాజేంద్రప్రసాద్ పోలీసు ఆఫీసర్ గా కనిపించినా ఈ రెండు పాత్రలతోను ప్రేక్షకులతో కనెక్ట్ కాలేక పోయాడు. దీనితో ఈ రెండు సినిమాలలోను రాజేంద్రప్రసాద్ కనిపించినా అతడిని సగటు ప్రేక్షకుడు ఏమి పట్టించుకోలేదు. దీనితో రాజేంద్రప్రసాద్ నటనలో పవర్ తగ్గిందా లేదంటే ఈ రెండు సినిమాలలోని కీలక పాత్రలు అయిన విజయశాంతి మురళీ శర్మల మందు తెలిపోయాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది దర్శకులు రాజేంద్రప్రసాద్ ప్రకాష్ రాజ్ కంటే మురళీ శర్మ రావ్ రమేశ్ లను ప్రోత్సహిస్తున్నారా అంటూ కొందరి అభిప్రాయం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: