స్టార్ హీరోలతే స్టెప్పులేస్తే హీరోయిన్ల కెరీర్ పీక్స్ లో ఉంటుంది. టాప్ రేసులో ముందుంటారు. కానీ మెగా సినిమాలు చేసిన అనూ ఇమ్మానుయేల్, మాత్రం స్లంపులో పడింది. ఫేడవుట్ స్టేజ్ కు వెళ్లిపోయింది. మరి అను విషయంలో మెగా ఫార్ములా ఎందుకు పనిచేయలేదో తెలుసా..!

 

అను ఇమ్మానుయేల్ కెరీర్ బిగినింగ్ లోనే మెగా సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసిలో ఆడిపాడింది. నా పేరు సూర్యలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది. దీంతో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ రిజల్ట్ మాత్రం మరోలా వచ్చింది. ఈ హీరోయిన్ ని ఫేడవుట్ కి దగ్గర చేసింది. అలాగే మీడియం రేంజ్ హీరో నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు మూవీలో నటించింది. కానీ ఈ సినిమాల తర్వాత అనూకు ఇప్పటి వరకు తెలుగులో మరో అవకాశం రాలేదు. 

 

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో నటిస్తే ఏ హీరోయిన్ అయినా ఈజీగా రేసులో ముందుకెళ్తుంది. కానీ అజ్ఞాతవాసి, నాపేరు సూర్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. పైగా ఈ సినిమాల్లో అను పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం కూడా లేదు. దీంతో అను ఇమ్మానుయేల్ ని అంతా లైట్ తీసుకున్నారు. 

 

అను ఇమ్మానుయేల్ భారీ సినిమాల్లో నటించినా భారీ విజయాలు అందుకోలేదు. పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న శైలజా రెడ్డి అల్లుడుతోనూ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో స్టార్ మేకర్స్ అంతా ఈమెను పక్కన పెట్టేశారు. ఈ ఎఫెక్టులతో అను కెరీర్ క్లైమాక్స్ కు చేరింది.  మొత్తానికి అను ఇమ్మానుయేల్ కు స్టార్ ఫార్ములా కలిసి రావడం లేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్యలతో నటించినా మెప్పించలేకపోయింది. దీంతో అను ఇమ్మానుయేల్ కు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. 



 

మరింత సమాచారం తెలుసుకోండి: