అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఇప్పటికే ఇద్దరు కాంబినేషన్ లో  జూలయి,  సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి  బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక మూడోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రకటన విడుదల కాగానే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను పెంచింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటల అన్ని సినిమాపై మరింత అంచనాలు పెంచేసాయి.. ఇక ఆ తర్వాత విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ఇక జనవరి 12న సంక్రాంతి ముందు విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ సాధించింది. అల వైకుంఠపురములో  సినిమాతో మరోసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ హిట్  కాంబినేషన్ అని ప్రూవ్ చేసుకున్నారు. 

 

 

 మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకు పోయింది ఈ సినిమా. ఇక ఈ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది. సంక్రాంతి బరిలో అసలు సిసలైన విన్నర్ గా నిలిచింది అలా వైకుంఠపురములో సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా అద్భుతమైన వసూళ్లు రాబట్టి దూసుకుపోతుంది అల వైకుంఠపురములో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎన్నడూ లేనంతగా వసూళ్లు రాబట్టింది అల వైకుంఠపురములో సినిమా. ఇక చాలా గ్యాప్ తర్వాత బన్నీ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్ళు రాబడుతుంది. 

 

 

 ఇప్పటికే చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టినట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా మరో ఘనతను సాధించింది. అల వైకుంఠపురములో  సినిమాతో అల్లు అర్జున్ మొదటి సారి యూఎస్ లో రెండు మిలియన్ల క్లబ్బులో చేరిపోయాడు. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి ఇది నాలుగోసారి... గతంలో అజ్ఞాతవాసి,  అ ఆ,  అరవింద సమేత సినిమాలతో రెండు మిలియన్ల క్లబ్బులో చేరిపోయాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇక ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాతో  కూడా నాలుగోసారి రెండు మిలియన్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇక యుఎస్లో తమ సినిమాలతో నాలుగు సార్లు రెండు మిలియన్ల  క్లబ్ లో చేరిన వారిలో  దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కరే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: