క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక ఇంటి పై ఐటీ అధికారుల సోదాల వ్యహారానికి సంబంధించి ఇప్పుడు వస్తున్న లీకులు చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వాస్తవానికి పారితోషికానికి సంబంధించి కూడ రష్మిక ఇంకా టాప్ రేంజ్ కి ఎదగలేదు. అనుష్క నయతారలు పుచ్చుకునే పారితోషికంలో ఆమెకు సగం కూడ ఇవ్వరు. 

అలాంటి పరిస్థితులలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రష్మిక పై జరిగిన ఇన్కంటాక్స్ దాడుల విషయంలో బయటపడని కోణాలు ఉన్నాయి అంటూ గాసిప్పుల హడావిడి జరుగుతోంది. తెలంగాణ‌ ఆంధ్రప్రదేశ్ ఇన్కంటాక్స్ స‌ర్కిల్స్ కు సంబంధించిన అధికారులు కొడ‌గు ప్రాంతంలోని  రష్మిక ఇంట్లో జరిపిన సోదాలులో ఆమె ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి అనేక లీకులు దొరకడమే కాకుండా ఆ వ్యవహారాలూ తెలుగు రాష్ట్రాల‌తో సంబంధం ఉన్న‌విగా మారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి రష్మిక కన్నడ ప్రాంతానికి చెందిన హీరోయిన్ ఆమెకు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఏమిటి అంటూ కూపీలు లాగుతున్నట్లు టాక్.  దీనితో ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోతుందా లేదంటే రష్మిక పై కేసులు నమోదు అవుతాయా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. నిన్న జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ సభకు రష్మిక రాకపోవడంతో ఇంకా ఆమె ఇంట్లో సోదాలు జరుగుతున్నాయా అంటూ గాసిప్పులు వస్తున్నాయి. 

ఇప్పుడిప్పుడే కెరియర్ లో ఎదుగుతున్న రష్మిక తండ్రి మదన్ కు అనేక వ్యాపార వేత్తలతో పరోక్ష సంబంధాలు ఉన్న నేపధ్యంలో ఈ ఇన్కంటాక్స్ దాడులు జరుగుతున్నాయి అంటూ గాసిప్పులు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా వస్తున్న ఈ గాసిప్పులు విని చాలామంది షాక్ అవుతున్నారు. ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో తాను కోరుకున్న ఇమేజ్ ని రష్మిక పొందని నేపధ్యంలో ఇప్పుడు ఈ అలజడి తో ఆమె షాక్ అవ్వడమే కాకుండా ఈ నెలాఖరున నితిన్ తో కలిసి నటించిన ‘భీష్మ’ కూడ హిట్ కాకపోతే రష్మికకు మరిన్ని కష్టాలు తప్పవు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: