పవన్ కళ్యాణ్ తో సినిమా అంత ఈజీ కాదని తెలిసినా.. రిలీజ్ ఎప్పుడో కూడా కన్ఫార్మ్ చేస్తున్నారు. హిందీలో హిట్ అయిన పింక్ తెలుగు రీమేక్ లో లాయర్ కనిపించనున్నాడు పవన్. షూటింగ్ మొదలు కాకుండానే.. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మే చివరిలో రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు నిర్మాతలు. 

 

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ గురించి రకరకాల వార్తలు వచ్చినా.. ఫైనల్ గా పింక్ రీమేక్ సెట్ అయింది. ఎంసీఏ మూవీ తీసిన వేణు శ్రీరాం దర్శకత్వంలో బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. పొలిటికల్ ఇష్యూస్ కారణంగా అనుకున్న టైమ్ లో సినిమా మొదలవుతుందన్న గ్యారెంటీ లేదు. 


పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం నటుడు కాదు. జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పవన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 2024 ఎలక్షన్స్ లక్ష్యంగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నాడు. మరోవైపు నటించేందుకు రెడీ అవుతున్నా.. వీలు చూసుకొని నటించడమే అవుతుంది. సమాజంలో వచ్చే ప్రాబ్లమ్స్ పై పోరాటం జరపాలి. ఇలా పవన్ పై చాలా బాధ్యతలున్నాయి. 

 

పవన్ తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో యాక్టింగ్ అంటే.. కష్టమే అయినా.. అభిమానుల కోరిక మేరకు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆయనకున్న రాజకీయ బాధ్యతల రీత్యా.. నిర్మాత కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు. షెడ్యూల్ అనుకున్ టైమ్ లో జరుగకపోవచ్చు. పొలిటికల్ ఇంపార్టెంట్ మేటర్ తెరపైకి వస్తే.. అటుగా అడుగు వేయాలి. షూటింగ్ డిస్టబెన్స్ కావొచ్చు. ఈ క్రమంలో సినిమా మేలో రిలీజ్ అవుతుందా..అంటే డౌటే. అయితే పవన్.. 20రోజుల పాటు డేట్స్ ఇస్తే చాలట. ఆయనపై షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఈ క్రమంలో నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసి.. సమ్మర్ హాలిడేస్ మిస్ కాకుండా.. మే చివరిలో రిలీజ్  చేస్తారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: