సింగర్ చిన్మయి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.  సింగర్ గా ఎంత పేరు తెచ్చుకున్నదో వివాదాస్పదంగా కూడా అంతే పేరు తెచ్చుకున్నది.  తమిళ రచయిత వైరముత్తును విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.  వైరముత్తు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.  కొన్నిరోజులపాటు వైరముత్తును పక్కన పెట్టారు.  


తరువాత తిరిగి ఆయన తన ప్రొఫెషన్ లో బిజీ అయ్యారు అనుకోండి.  తరువాత కూడా ఆమె తన స్త్రీవాదంతో అనేక నిర్ణయాలు తీసుకున్నది.  అనేకమంది పై అనేక విమర్శలు చేసింది.  అప్పటి నుంచే మహిళలతో సినిమా ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉంటున్నారు.  మీటు వివాదం అప్పట్లో అనేకమందిపై వేటు వేసేలా చేసింది.  చిన్మయి అంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.  


ఇక ఇదిలా ఉంటె, చిన్మయి రీసెంట్ గా ఓ ట్వీట్ చేసింది.  ఆ ట్వీట్ ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉన్నది.  "ఓసారి నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఓ 28 ఏళ్ల వయసున్న వ్యక్తి నా ముందు బైక్ ఆపి అడ్రెస్ అడిగాడు. నేను అడ్రెస్ చెప్పాను. అయితే అతను అతి తెలివి ప్రదర్శిస్తూ ‘నాకు అడ్రెస్ సరిగ్గా అర్థం కాలేదు. నాతో పాటు బైక్ మీద వచ్చి రూట్ చూపిస్తారా’ అని అడిగాడు. అప్పుడు నేను ఎవరైనా అబ్బాయిని తీసుకెళ్లండి అని చెప్పాను. కానీ అతను వినలేదు. తన వద్ద లైసెన్స్ లేదని, ఒకవేళ పోలీసులు పట్టుకున్నా వెనక అమ్మాయి ఉంది కాబట్టి వదిలేస్తారని చెప్పాడు. నాకు భయం వేసి నన్ను తీసుకెళ్లడానికి మా అన్నయ్య వస్తున్నాడని చెప్పి పరుగులు తీశాను".  


అయితే, ఇదే అనుభవం కొన్నాళ్ల తరువాత నా చెల్లెలికి కూడా ఎదురైంది.  ప్రబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేసే ఆడపిల్లలకు తరచుగా ఇలాంటి సంఘటనలు ఎదురువుతున్నాయి.  ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి" అని రాసున్న ట్వీట్ ను చిన్మయి షేర్ చేసింది.  ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.  ప్రతి ఒక్కరు ఈ ట్వీట్ కు చలించిపోయారు.  అయితే, ఆ ట్వీట్ ను పెట్టిన వ్యక్తి ఎవరు అన్నది మాత్రం బయటకు రావడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: