మాస్ మహారాజా ఈ  సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. బాక్సాఫీస్ టార్గెట్ మిస్ కాదనే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కొన్నాళ్లుగా రొటీన్ మాస్ మసాలా మూవీతో నిరాశపరుస్తున్న రవితేజ ఈ సారి సర్ ప్రైజింగ్ థీమ్ తో మ్యాజిక్ చేయబోతున్నాడట. 


రాజాది గ్రేట్ సక్సెస్ తో గాడిలో పడినట్టే కనిపించిన రవితేజ హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో మళ్లీ ట్రాక్ తప్పాడు. వరుస ఫ్లాప్స్ తో గత కొన్నేళ్లలో మాస్ రాజా సినిమాలపై  సినీ జనాలకు ఆసక్తి పోయింది. మిగతా స్టార్స్ రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తుంటే రవితేజ మాత్రం రొటీన్ మూవీస్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాడు. కాస్త  ఆలస్యమైన విషయం గ్రహించిన మాస్ రాజా కూడా డిస్కో రాజాగా సరికొత్త కాన్సెప్ట్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. 

 

కెరీర్ ప్రమాదంలో ఉన్న ఈ టైమ్ లో రవితేజ డిస్కోరాజాతో చాలా కొత్తగా ట్రై  చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సెన్సేషనల్ హిట్ తీసిన వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ మొదలైనపుడు మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ రీసెంట్ గా టీజర్ రిలీజయ్యాక ఇండస్ట్రీలో సినిమా గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. 

 

దర్శకుడు వీఐ ఆనంద్, రవితేజను చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. ప్రయోగాత్మక కాన్సెప్ట్ కు ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా మలిచినట్టు టాక్. టీజర్ లో మాస్ రాజా స్టైలిష్ గా వెరీ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో రవితేజ ఇంత ఫ్రెష్, చలాకీగా ఏ సినిమాలో కనిపించింది లేదు. ఈ సినిమా విజయంపై మాస్ రాజా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న డిస్కో రాజాను ఈ నెల 24న రిలీజ్ చేయబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: