అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. ఇక పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. ప్లానింగ్ సరిగ్గా ఉంటే సినిమాల్లో కూడా విజయం మీ వెంటే వస్తుందని చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది.  అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్నా చితక పాత్రల్లో నటించినా అంతగా గుర్తింపు రాని అనసూయ.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో ఒక్కసారిగా అనసూయకు అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడ్డాయి. 

 

ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు  ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ స్థాయి నుంచి లోక‌ల్ గ్యాంగ్స్ జ‌డ్జ్ స్థాయికి వెళ్లింది ఈ బ్యూటి. ఈ నేప‌థ్యంలోనే  లోకల్ గాంగ్స్ కార్యక్రమంలో తెగ సందడి చేస్తోంది. ముఖ్యంగా తన డాన్సులతో సెగలు రేపుతోంది. అయితే.. తాజాగా విడుదలైన లోకల్ గ్యాంగ్ ప్రోమోలో అనసూయ  ఫైర్ బ్రాండ్  రోజా మీద కూడా పంచ్ డైలాగ్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. శేఖర్ మాస్టర్ వేరే షోకు వెళ్లిపోయిన వేళ.. ఇక మన మాస్టర్ అన్నది ఉండదని ప్రదీప్ అంటారు.

 

దానికి అనసూయ అం.. ఆ: వరకూ వెళ్లిందని కల్పించుకున్నారు. ఈ విషయం మీద రేపు మధ్యాహ్నం చర్చిద్దామని ఫోన్లో చెప్పినట్లుగా యాంకర్ ప్రదీప్ అంటే.. దానికి స్పందించిన అనసూయ.. యాంకరింగా? పక్కన పార్టీ లోనా? అంటూ నవ్వుతూ మాట కట్ చేశారు? దీనికి శేఖర్ మాస్టర్ ఎక్స్ ప్రెషన్ చూసినప్పుడు.. అంత సాహసం చేశావేంటి అనసూయ అన్నట్లుగా ఉంది. దీంతో  రోజాపై కాస్త వ్యంగ్యంగా  ఆ తరహా డైలాగ్లు సరదా కోసమే వేసినా.. అంతగా నోరు జారాల్సిన అవసరం ఉండా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: