తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ అంటే హాట్ లుక్ కి కేరాఫ్ అడ్రస్ అంటారు.  ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ‘జబర్ధస్త్’ కామెడీ షో కి యాంకర్ గా వచ్చిన అనసూయ తన అందాల ఆరబోతతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది.  ఎలాంటి వారితో అయినా చలాకీగా మాట్లాడుతూ.. నవ్విస్తూ అతి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ సంపాదించింది.  జబర్ధస్త్ లో మంచి పాపులారిటీ రాగానే నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన మూవీలో చిన్న పాత్రలే అయినా అనసూయకు మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత బుల్లితెర, వెండి తెరపై తన సత్తా చాటుతుంది.  జబర్ధస్త్ లోనే కాకుండా ఇతర ఛానల్స్ లో యాంకర్ గా కొనసాగుతుంది. 

 

ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్తగా నటించిన అందరి మనసు దోచింది.  అంతకు ముందు సాయిధరమ్ తేజ్ తో ‘సూయా సూయా అనసూయ’ అంటూ ఐటమ్ సాంగ్ లో చిందులేసింది.  ఇలా మెగా హీరోలతో నటిస్తున్న అనసూయకు మరో బంపర్ ఆఫర్ వచ్చిందని టాలీవుడ్ టాక్.  సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. కేరళ షెడ్యూల్ నందు అల్లు అర్జున్ పాల్గొనలేదు.

 

ఈ మూవీలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తుంది.  విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారు.  తాాజాగా  ఈ మూవీ కాస్టింగ్ లో  యాంకర్  అనసూయ కూడా జాయిన్ అయ్యారట.  అయితే  రంగస్థలంలో మాస్ లుక్ లో కనిపించి ఈ అమ్మడు సుకుమార్ - బన్నీ మూవీలో మాత్రం గ్లామర్ లుక్ లో కనిపించబోతున్నట్లు టాలీవుడ్ టాక్. . మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ శేషాచలం అడవులలో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: