అందం అభినయంతో అందరినీ ఆకర్షిస్తూ తన హాట్ హాట్ అందాల ఆరబోతతో ఎంతోమందికి చమటలు పట్టిస్తూ టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ పూజా హిగ్డే . ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పూజా హెగ్డే ఆ తర్వాత వరుస అవకాశాలను చేజిక్కించుకుంటు.. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ కొట్టేసి భారీ విజయాలను అందుకుంది పూజ హిగ్డే . తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ అమ్మడు. మరోవైపు తన హాట్ హాట్ ఫోటో షూట్లతో ఎంతోమందికి హీట్  పెంచుతూ చెమటలు పట్టించింది. 

 


 ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ  బిజీ బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు పూజా హెగ్డే. అయితే ఈ అమ్మడు  టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అమ్మాయిల కలల రాకుమారుడు అయినా హృతిక్ రోషన్ సరసన ఛాన్స్ కొట్టేసి జోధా అక్బర్ సినిమాలో నటించింది. అయితే ఇప్పటికే వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజ హిగ్డే . ఇక తాజాగా అల్లు అర్జున్ తో రెండో సారి జోడీ కట్టి అల వైకుంఠపురములో  సినిమాలో  నటించింది.  ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

 

 ఇకపోతే తాజాగా మరో బాలీవుడ్ ఆఫర్ ని కొట్టేసింది పూజా హిగ్డే . ఇప్పటికే హృతిక్ రోషన్ సరసన ఛాన్స్ కొట్టేసి జోధా అక్బర్ లో నటించి మంచి విజయాన్ని అందుకున్న పూజాహెగ్డే... ఇప్పుడు తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ తో   కొత్త సినిమాకు ఓకే చేసిన తర్వాత.. పూజ హెగ్డే కు బాలీవుడ్ నుండి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ తో  కలిసి నటించేందుకు అవకాశం వచ్చిందట పూజ హిగ్డే కు.  అయితే అక్షయ్ కుమార్ తో నటించే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా  పూజా హెగ్డే అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: